తూర్పుగోదావరి

ప్రత్యేక హోదా డిమాండును వదిలేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 31: ప్రత్యేక హోదాకు కట్టుబడి వున్నామని, కేంద్రంపై వత్తిడి చేస్తామని రాష్ట్ర డిప్యూటీ సిఎం చినరాజప్ప అన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం పక్కనబెట్టే ధోరణి కన్పిస్తోందన్నారు. రాజమహేంద్రవరంలో ఆదివారం అంత్య పుష్కర స్నానం ఆచరించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి వున్నామని, చెప్పినట్టుగా రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. కొంతమంది పెద్ద నాయకులు ప్రత్యేక హోదాకు కలిసివచ్చేలా లేరన్నారు. ఆర్థిక సంఘం అధికారాలు నిధుల కేటాయింపు వరకే పరిమితమని, అంతే తప్ప కేంద్రాన్ని ఆదేశించే అధికారం ఆర్థిక సంఘానికి లేదని చినరాజప్ప అన్నారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, రాష్ట్రానికి అవసరమైన నిధులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారన్నారు. ఈసారి కృష్ణా పుష్కరాలు గోదావరి, కృష్ణా నదుల నీటితో జరుపుకోవడం అదృష్టమన్నారు. కృష్ణా పుష్కరాల పనులు ఐదవ తేదీకల్లా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణానదిలోకి ప్రవేశించడం వల్ల అక్కడి రైతుల పంటలు సుభిక్షమయ్యాయన్నారు. ఎంపి మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ గత ఏడాది గోదావరి నదిలో ప్రవేశించిన పుష్కరుడు ఆగస్టు 12వ తేదీన కృష్ణా నదిలో ప్రవేశించడం ద్వారా కృష్ణా పుష్కరాలు ఆరంభమవుతాయన్నారు. 11వ తేదీన అంత్య పుష్కరాలకు వీడ్కోలు పలికి, 12న కృష్ణా పుష్కరాలకు స్వాగతం పలికే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారని చెప్పారు. ఈ ఏడాది కూడా పంటలు బాగా పండి రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని మనసారా కోరుకుంటున్నానన్నారు. కార్యక్రమంలో అంత్య పుష్కరాల నోడల్ అధికారి విజయ రామరాజు, పోలీసు అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి, సబ్ కలెక్టర్ విజయకృష్ణన్, ఎఎస్పీ గంగాధరరావు, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి ఏసుదాసు, ఫ్లోర్ లీడర్ వర్రే శ్రీనివాసరావు, పలువురు కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.