తూర్పుగోదావరి

మితిమీరిన పెత్తనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 27: జిల్లాలో అధికారుల పెత్తనం మితిమీరటం వల్ల ప్రజల్లో పార్టీ పట్ల వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఏర్పడుతోందని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఫిర్యాదుచేసినట్టు తెలిసింది. ఆదివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లాలోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు హాజరయ్యారు. ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారుల తీరుపైనే మాట్లాడినట్టు తెలుస్తోంది. అధికారులు తమ ఇష్టమొచ్చినట్టు చేసుకుపోతున్నారని, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కనీస గౌరవం కూడా అధికారుల వద్ద లభించటం లేదని ఫిర్యాదుచేశారు. అధికారులు తాము చేపట్టే కార్యక్రమాల పట్ల ముందుగానే ప్రజలకు అవగాహన కల్పిస్తే, ప్రజలంతా సహకరిస్తారని నాయకులు సూచించినట్టు తెలుస్తోంది. ఉచిత ఇసుక విధానం అమలు జరుగుతున్న తీరు, అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. జన్మభూమి కమిటీలు సమర్ధవంతంగా పనిచేయటం లేదన్న అంశం సమన్వయ కమిటీ సమావేశంలో చర్చకు వచ్చింది. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, జన్మభూమి కమిటీ సభ్యులతో కలిపి ఒక రోజు సమావేశం నిర్వహించాలని సమావేశంలో నాయకులు అభిప్రాయపడ్డారు. జన్మభూమి కమిటీలు సమర్ధవంతంగా పనిచేయకపోతే, కమిటీలను మార్చాలన్న అభిప్రాయం కూడా సమావేశంలో పాల్గొన్న నాయకులు వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది.
పార్టీ కార్యకర్తలకు శిక్షణా తరగతులు ఏర్పాటుచేయాలని భావిస్తున్నట్టు ఈ సందర్భంగా జిల్లా నాయకులకు లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో నాలుగు చోట్ల ఈ సమావేశాలను ఏర్పాటుచేస్తామని, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు కలిపి పశ్చిమగోదావరి జిల్లాల్లోని జంగారెడ్డిగూడెంలో శిక్షణా తరగతులు ఏర్పాటుచేయాలని భావిస్తున్నామని జిల్లా నాయకులకు లోకేష్ చెప్పారు. ఉగాది పండగ తరువాత ఏప్రిల్ 9న జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని పోలవరంలోని ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో ఏర్పాటుచేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి దేవినేని ఉమ సూచించటంతో, అంతా అందుకు అంగీకరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాగా జరుగుతోందని, అందువల్ల అదే ప్రాంతంలో సమావేశం నిర్వహించటం ద్వారా, ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న తీరును స్వయంగా చూస్తే, ప్రజలకు వివరించేందుకు బావుంటుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి దేవినేని ఉమతో పాటు ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్ చైర్మన్లు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.