తూర్పుగోదావరి

తెలుగుదేశం ద్రోహుల పార్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 7: తెలుగుదేశం పార్టీని తెలుగు ద్రోహుల పార్టీగా పిసిసి ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి అభివర్ణించారు. తెలుగుప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్టీ రామారావు టిడిపిని స్థాపిస్తే ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిల్లీలో ప్రధాని మోడీ వద్ద తాకట్టుపెడుతున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ యుపిఏ హయాంలో ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రత్యేకహోదా, విభజన హామీలను చేర్చి చట్టబద్ధత కల్పించారని, దీనిపై రాష్టప్రతి కూడా సంతకం చేశారన్నారు. తద్వారా రాష్ట్రానికి 5లక్షల కోట్ల ప్రయోజనం చేకూరేదన్నారు. అయితే తరువాత అధికారంలోకి వచ్చిన బిజెపి హామీలను తుంగలో తొక్కి తెలుగు ప్రజలను మోసం చేసిందన్నారు. ఎంతో నమ్మకంతో తెలుగుదేశం, బిజెపిలను ప్రజలు గెలిపిస్తే వారి నమ్మకాన్ని ఆపార్టీలు వమ్ము చేశాయని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా కేవలం 6200కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సత్తా ఉంటే ప్రత్యేకహోదా సాధించడం గంట పని అని స్పష్టం చేశారు. హోదా అమలుకు కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేస్తే సరిపోతుందని వివరించారు. అయితే చంద్రబాబుకు ఆ సత్తా లేదని విమర్శించారు. ఆయనకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన స్థానంలో సమర్థులైన నాయకుడ్ని ముఖ్యమంత్రిగా నియమించాలన్నారు. మోడీ మోసం, చంద్రబాబునాయుడు చేతకానితనం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదాను సాధించే వరకు కాంగ్రెస్‌పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని తులసిరెడ్డి స్పష్టం చేశారు. ఈసమావేశంలో కాంగ్రెస్ నాయకులు మార్టిన్‌లూథర్, ఎన్‌వి శ్రీనివాస్, బోడా వెంకట్, దాసి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.