తూర్పుగోదావరి

వైభవంగా నిత్యహారతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 8: రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో కిక్కిరిసిన జన సందోహం మధ్య గోదావరి నదికి హారతి నీరాజనం పలికారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో గోదావరి నది నిత్య హారతి కార్యక్రమంలో భాగంగా అంత్య పుష్కరాలు మొదలైనప్పటి నుంచి అఖండ హారతి ఇస్తున్నారు. సోమవారం వేద పండితులు వేద ఘోష నడుమ వివిధ రకాల హారతులతో అఖండ గోదావరి నదికి నీరాజనం పలికారు. నిత్యం సాయంత్రం వేళ గోదావరి నదికి పలికే ఈ హారతి కార్యక్రమాన్ని తిలకించేందుకు గంట ముందుగానే భక్త జనం పుష్కర ఘాట్‌లో బారులు తీరారు. హారతి నీరాజనాన్ని దర్శించుకుని తరిస్తున్నారు. గోదావరి నది హారతి ప్రాశస్థ్యం కావడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు హారతిని దర్శించుకుని నదికి వందనం పలుకుతూ పూనీతమవుతున్నారు. సోమవారం హారతి కార్యక్రమాన్ని తిలకించేందుకు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ముర్రు ముత్యాలనాయుడు, అంత్య పుష్కర నోడల్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ విజయ రామరాజు, అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి తదితరులు హాజరయ్యారు. పుష్కర ఘాట్‌లో పెద్ద ఎత్తున వచ్చిన జన సందోహం మధ్య హారతి కార్యక్రమం వైభవంగా సాగింది. గోదావరి నది హారతి సమయంలో మరింత రమణీయత సంతరించుకుంది. ఇదిలా వుండగా అంత్య పుష్కరాలను పురష్కరించుకుని నగరంలో వివిధ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రంలో విశాఖపట్నంకు చెందిన శ్రీ మీరా కళా జ్యోత్య్న సంస్థ ప్రదర్శించిన శ్రీ కాళహస్తి మహాత్యం నాటకం అలరించింది. కోటిలింగాల ఘాట్ వద్ద ఎన్టీఆర్ నటించిన వినాయక చవితి చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా పుష్కర ఘాట్ వద్ద ఏర్పాట్లపై కమిషనర్ విజయ రామరాజు, అర్బన్ ఎస్పీ రాజకుమారి, వివిధ శాఖల అధికారులు సమీక్షించారు.