తూర్పుగోదావరి

ముగిసిన అంత్య పుష్కరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలమూరు, ఆగస్టు 11: అంత్య పుష్కరాలు చివరి రోజైన గురువారం జొన్నాడ పుష్కర ఘాట్‌లో భక్తులు పోటెత్తారు. తెల్లవారు ఝామునుండే భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఈ ఘాట్ వద్ద పండగ వాతావరణం ఏర్పడింది. భక్తులకు తగినట్లుగానే ఘాట్ వద్ద ఇన్‌ఛార్జి బి వరప్రసాద్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే స్నానాలు ఆచరించే భక్తులకు దైవ దర్శనం అనంతరం సర్పంచ్ రూతియ్య, ఉప సర్పంచ్ తాడి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రసాదాలు పంపిణీ చేశారు. అలాగే ఎటువంటి సంఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు హైవేపై ట్రాఫిక్ నియంత్రించడంతోపాటు బందోబస్తు నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వరకూ భక్తుల తాకిడి అధికంగానే ఉందని ఘాట్ ఇన్‌ఛార్జి తెలిపారు. అలాగే ఘాట్ వద్ద సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అధికార్లకు భక్తులు సహకరించి అంత్య పుష్కరాలు ప్రశాంతంగా ముగియడంతో స్థానిక ఎంపిడిఒ నాతి బుజ్జి, తహసీల్దార్ టిఆర్ రాజేశ్వరావు, సర్పంచ్ రూతియ్య, ఉప సర్పంచ్ తాడి శ్రీనివాసరెడ్డి భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు.
అయినవిల్లి: అంత్యపుష్కరాలు ఆఖరవురోజైన గురువారం ముక్తేశ్వరంలోని తొగరపాయరేవులో భక్తులు పొటెత్తారు. వేకువ జాము నుండి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యారు. గురువారం ఒక్కరోజు సాయంత్రం వరకూ భక్తులు సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చి ముక్తేశ్వరంలో ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించారు. సుమారు 6వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఘాట్ ఇన్‌ఛార్జి విజయలక్ష్మి తెలిపారు. అదేవిధంగా తమ పితృదేవతలకు అధిక సంఖ్యలో పిండప్రదానాలు చేశారు. పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అయినవిల్లి సర్పంచ్ కొపనాతి శ్రీరామచంద్రమూర్తి పంచాయతి సిబ్బందితో ఏర్పాట్లు చేయించారు. అలాగే అయినవిల్లి పిహెచ్‌సి వైద్య సిబ్బంది భక్తులకు ఉచిత మందులు పంపిణీ చేశారు. స్నానాలు ఆచరించిన భక్తులు చెంతనే ఉన్న క్షణముక్తీశ్వరస్వామి వారిని, అయినవిల్లి సిద్ధివినాయక స్వాములను దర్శించుకుని పూజలు చేశారు.
ఐ పోలవరం : మురమళ్ల గ్రామంలో నిత్యకళ్యాణం పచ్చతోరణంలా విరాజిల్లుతున్న శ్రీ వీరేశ్వరస్వామి దేవస్థానం ఛైర్మన్ జంపన భీమరాజు, ఇఓ బళ్ల నీలకఠం ఆధ్వర్యంలో గురువారం అంత్య పుష్కరాలు ఆఖరి రోజున పుష్కరుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. దేవస్థానం నుండి రాష్ట్రీయ స్వయం సేవాక్ సౌజన్యంతో శ్రీశ్రీశ్రీ కృపానంద్‌గురు స్వామీజీ, శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి పీఠాధిపతి వారి ఆధ్వర్యంలో పుష్కరుడికి వీడ్కోలు చెప్పారు. కొన్ని ఆధ్యాత్మిక ప్రవచనా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మేళ తాళాలతో పవిత్ర వృద్ధ గౌతమీ నది ఒడ్డుకు చేరుకొని ఆలయ అర్చకులు, పురోహితులు, వేదపండితుల ఆధ్వర్యంలో గోదావరి మాతకు పంచ హారతులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞానభారతి ఆంధ్ర కన్వీనర్ కెఎస్ శాస్ర్తీ, బులుసు జగదీష్, వై విజయలక్ష్మి, దేవస్థానం మాజీ ఛైర్మన్ కటారి నాని, గ్రామస్థులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మలికిపురం: పవిత్రమైన గోదావరి అంత్యపుష్కరాలు గురువారం ఘనంగా ముగిసాయి. పుష్కరాలు చివరిరోజైన రామరాజులంక ఘాట్‌లో 2వేల మంది, దిండి ఘాట్‌లో 2వేల మంది, అంతర్వేది క్షేత్రంలో వశిష్ఠా ఘాట్‌లో 10 వేల మంది పుణ్యస్నానాలు అచరించారు. గూడపల్లి మునివంపువద్ద 3,500 మందికి పుష్కరాల ముగింపు సందర్భంగా అన్నసమారాధన నిర్వహించారు.
కపిలేశ్వరపురం: గోదావరి అంత్య పుష్కరాల ఆఖరి రోజైన గురువారం మండలంలోని కేదార్లంక, తాతపూడి, కపిలేశ్వరపురం, కోరుమిల్లి పుష్కర ఘాట్లు భక్తులతో పోటెత్తాయి. అంత్య పుష్కరాలు ముగియడంతో గోదావరి మాతకు ఆయా ఘాట్ల వద్ద ఘనంగా హారతులిచ్చారు. తాతపూడి పుష్కర ఘాట్‌లో ఆ గ్రామ సర్పంచ్ వెనే్నటి వీర వెంకట సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో వేద పండితులు బిక్కవోలు కేశవాచార్యులు పర్యవేక్షణలో పలువురు రుత్విక్కులు గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టు వస్త్రాలు సమర్పించారు.
అనంతరం భక్తిశ్రద్ధలతో హారతులిచ్చారు. భక్తులకు ప్రసాద వితరణ గావించారు. అలాగే ఆయా ఘాట్లలో సర్పంచులు రంకిరెడ్డి సత్యవతి, ఎంఎస్‌వి మునిప్రసాద్, సలాది వీరబాబు గోదావరి మాతకు హారతులిచ్చారు. తహసీల్దారు జి చిన్నిబాబు, ఎంపిడిఒ వి అబ్రహాంలింకన్ పర్యవేక్షణలో అంత్య పుష్కరాల 12 రోజులు ఆయా గ్రామాల కార్యదర్శులు నరసింహారావు, సుప్రియ, వేణుగోపాల్, వీర్రాజు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.