తూర్పుగోదావరి

కృష్ణా పుష్కరాలకు తరలివెళ్లిన మున్సిపల్, పోలీసు సిబ్బంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 12: గోదావరి పుష్కరాలు, అంత్య పుష్కరాలను నిర్వహించిన అనుభవం కలిగిన నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బందిని విజయవాడ కృష్ణా పుష్కరాల్లో సేవలందించేందుకు నియమించారు. సుమారు 64 మంది నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది విజయవాడ వెళ్లారు. డిప్యుటీ కమిషనర్ ఎంవిడి ఫణిరామ్, ఆరోగ్య అధికారి డాక్టర్ జి సత్యదేవ్, ఇఇ వైవి కోటేశ్వరరావు, ఎసిపి శ్రీనివాసరావు, ఇద్దరు డిఇలు, నలుగురు బిల్డింగ్ ఇనస్పెక్టర్, ఆరుగురు శానిటరీ ఇనస్పెక్టర్లు, ముగ్గురు మెడికల్ ఆఫీసర్లు, ఇద్దరు సూపరింటెండెంట్లు, ఆర్‌ఓ, ఆర్‌ఐ, ఆరుగురు సీనియర్ అసిస్టెంట్లు, 10 మంది జూనియర్ అసిస్టెంట్లు, 16 మంది శానిటరీ మేస్ర్తిలు, ఆరుగురు అనుభవజ్ఞులైన సిబ్బంది వెళ్లారు. కాగా, కృష్ణా పుష్కరాల విధుల్లో భాగంగా సంగం ఇన్‌చార్జిగా నియమితులైన కమిషనర్ వి విజయరామరాజు స్వల్ప అనారోగ్యానికి గురికావడంతో విజయవాడ వెళ్లలేదు. ఆయన సెలవులో ఉన్నట్లు తెలిసింది. అలాగే అదనపు కమిషనర్ జి శ్రీనివాసరావు కూడా సెలవులో ఉన్నట్లు సమాచారం. కీలక అధికారులంతా సెలవులో ఉండటంతో నగరపాలక సంస్థ ఖాళీ అయినట్టయ్యింది. మరోవైపు అర్బన్ ఎస్పీ బి రాజకుమారితో పాటు, పలువురు డిఎస్పీలు, సిఐలు, సుమారు 760 మందికిపైగా కానిస్టేబుళ్లు కృష్ణా పుష్కరాల విధులకు వెళ్లడంతో పోలీసుశాఖలో కూడా సందడి కనిపించడం లేదు. 2వ శనివారం, ఆదివారం, స్వాతంత్య్ర దినోత్సవం కలిసి రావడంతో ఈమూడురోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. మంగళవారం నుంచి మళ్లీ సందడి ప్రారంభమవుతుంది. కాగా, గురువారం రాత్రి వరకు నగరపాలక సంస్థ, పోలీసు, ఇతర విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది రాజమహేంద్రవరం అంత్య పుష్కరాల్లో పనిచేసి, వెంటనే కృష్ణా పుష్కరాలకు తరలివెళ్లాల్సి రావడంతో శారీరకంగా కాస్త ఇబ్బందులకు గురయ్యారు.