తూర్పుగోదావరి

జిల్లాలో పది రోజులు తిరంగా యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 12: ఈ నెల 15వ తేదీ నుండి 10 రోజుల పాటు జిల్లాలో బిజెపి ఆధ్వర్యంలో తిరంగా యాత్రను నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. శుక్రవారం కాకినాడ నగరంలో బిజెపి పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ముఖ్యఅతిధిగా హాజరైన వీర్రాజు కొంత సేపు విలేఖర్లతో మాట్లాడారు. తిరంగ యాత్రను కేంద్ర అధినాయకత్వం పిలుపునివ్వడంతో ఆ రోజుల్లో స్వాతంత్య్ర యోధుల కుటుంబాల వద్దకు తమ యువమోర్చా ఆధ్వర్యంలో కలుస్తామన్నారు. అలాగే మహిళలతో రక్షాబంధన్ నిర్వహించి మాజీ సైనికులు, వారి కుటుంబాలకు చెందిన వారికి రాఖీలు కడతామని చెప్పారు. ఈ కార్యక్రమాలతో జిల్లాలో పార్టీని బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి సుమారు 4 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వల్ల ఏడాదికి 25 వేల కోట్లు మాత్రమే వస్తాయని అంత కంటే ఎక్కువగా ఇప్పటికే గడిచిన రెండేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులిచ్చినట్లు సోము వెల్లడించారు. రాష్ట్రంలో 35 లక్షల సభ్యత్వం ఉందని పార్టీని బూత్ స్ధాయిలో బలోపేతానికి చర్యలు తీసుకోనున్నట్లు వీర్రాజు చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య, నాయకులు వేటుకూరి సూర్యనారాయణ రాజు, పైడా కృష్ణమోహన్, కర్రి చిట్టిబాబు, బత్తుల లక్ష్మికుమారి, ఎం అయ్యాజీవేమా, ఎపిఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.