తూర్పుగోదావరి

విలీన మండలాల్లో మెరుగైన వైద్య సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, ఆగస్టు 18: విలీన మండలాలైన చింతూరు, కూనవరం, విఆర్ పురం, ఎటపాక మండలాల్లో మరింత మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్టు తూర్పు గోదావరి జిల్లా డిఎంఅండ్‌హెచ్‌ఒ చంద్రయ్య తెలిపారు. గురువారం డిఎంఅండ్‌హెచ్‌ఒ చంద్రయ్య విలీన మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా చింతూరు ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నాలుగు మండలాల్లో తొమ్మిది పిహెచ్‌సిలకు గాను ప్రతి పిహెచ్‌సికి సూపర్‌వైజర్లను నియమించినట్టు చెప్పారు. ఈ సూపర్‌వైజర్లు జ్వరంతో బాధపడుతున్న రోగులకు సక్రమంగా మందులు వాడేవిధంగా పర్యవేక్షిస్తున్నారన్నారు. అలాగే రోగాలు, దోమల నివారణకు ప్రతి మండలానికి ఒక్కో సబ్ యూనిట్ ఆఫీసర్‌ను నియమించినట్టు పేర్కొన్నారు. ఏజెన్సీలో 13 మంది వైద్యులు అవసరం ఉండగా 11 మందిని నియమించినట్టు డిఎంఅండ్‌హెచ్‌ఒ చెప్పారు. విలీన మండలాల్లోని ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు జ్వరాలతో మృత్యువాత పడుతున్నారని, అటువంటివి జరగకుండా ఆశ్రమ పాఠశాలల్లో ప్రత్యేక వైద్య సేవలు అందించనున్నట్టు తెలిపారు. ఆశ్రమ పాఠశాలల్లో జ్వరంతో బాధపడుతున్న విద్యార్థినులను ఇంటికి పంపకుండా వారికి ప్రత్యేక వైద్య సేవలు అందిచనున్నట్టు డిఎంఅండ్‌హెచ్‌ఒ చంద్రయ్య చెప్పారు. అలాగే మారుమూల గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, రోగాలపై ప్రజలను అప్రమత్తం చేయనున్నట్టు ఆయన తెలిపారు. అనంతరం స్థానిక ఐటిడిఎలో విలీన మండలాల వైద్యాధికారులు, సిబ్బందితో సమావేశం ఏర్పాటుచేసి తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. విలేకర్ల సమావేశంలో ఏజెన్సీ అడిషిషనల్ డిఎంఅండ్‌హెచ్‌ఒ ఎం పవన్‌కుమార్, జిల్లా మలేరియా అధికారి పిఎస్‌ఎస్ ప్రసాద్, వైద్యులు సుబ్బమ్మ, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.