తూర్పుగోదావరి

దళితులపై దాడులతో బిజెపికి సంబంధం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 18: అమలాపురంలోని గోవును చంపారని చర్మకార వృత్తి చేసుకునే వారిపై జరిగిన దాడిలో బిజెపికి ఎంతమాత్రం సంబంధం లేదని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య స్పష్టం చేశారు. వారిపై దాడులు చేసిన వాళ్ళు బిజెపికి చెందిన వాళ్ళు కాదన్నారు. దీన్ని కొన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాలకొండయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మాలకొండయ్య పార్టీ నాయకులతో కలిసి స్ధానిక ఆర్‌అండ్‌బి అతిధి గృహంలో విలేఖర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై త్వరలో పోలీసుస్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో తిరంగా యాత్ర విజయవంతంగా నిర్వహిస్తున్నామని అందులో భాగంగా జాతీయ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నామని, దేశ రక్షణలో పాల్గొన్న జవాన్ల కుటుంబాలకు మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాఖీలు కడుతున్నామనా చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వాతంత్య్ర దినోత్సవం రోజున చేసిన ప్రసంగంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని విమర్శించారని ఆ వ్యాఖ్యలు బాధాకరంగా ఉన్నాయన్నారు. హోదాపై చేసిన ప్రసంగం ఇతర రాష్ట్రాల సిఎంలను రెచ్చగొట్టేవిధంగా ఉందన్నారు. ఈ రెండేళ్ళ కాలంలో రాష్ట్రం అభివృద్ధి కేవలం బిజెపి ఇచ్చిన నిధులతోనే అయిందని చెప్పారు. జిల్లాకు కేంద్రం ఆధీనంలోని సుమారు ఐదు సంస్ధలను కేటాయించిందని అది జిల్లాలోని పాలక యంత్రాంగం స్ధలాన్ని సేకరించకపోవడంతో వేరే ప్రదేశానికి తరలిపోయాయని మాలకొండయ్య చెప్పారు. ప్రత్యేక హోదా కన్నా అధిక నిధులు ఇచ్చేలా కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు వేటుకూరి సూర్యనారాయణ రాజు, పెద్దిరెడ్డి రవికిరణ్, కోరాడ లక్ష్మీతులసి, తుమ్మల పద్మ, కర్రి పాపారావు, బండారు భాస్కర్, చక్కా రమేష్, ఎంజిఆర్, పొన్నగంటి రామారావుతదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు తిరంగ యాత్రలో భాగంగా పిఆర్ ప్రభుత్వ పాఠశాలలో అల్లూరి, మద్దూరి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.