తూర్పుగోదావరి

ఇసుక లారీలతో ఇక్కట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతానగరం, మార్చి 27 మండలంలోని ఉచిత ఇసుక ర్యాంపు ముగ్గళ్ళ ర్యాంపునకు వచ్చే వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఏటిగట్టు పరీవాహక ప్రాంతం సీతానగరం మండలం ర్యాంపుతో సంబంధం లేకుండా యథేచ్ఛగా ఎక్కడ వీలైతే అక్కడ గోదావరిలో ఇసుకను తవ్వి తరలించేస్తున్నారు. ఒక నిర్దిష్టమైన సమయం కాకుండా ఇసుకను రాత్రి, పగలు సమయాల్లో తరలిస్తుండడంతో, వాహనాలతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రయాణీకులు పలు అవస్థలు పడుతున్నారు. ఇరువైపులా ఇసుక లోడింగ్‌కోసం కిలోమీటర్ల వరకు లారీలు, ట్రాక్టర్లు నిలిచిపోయి దుమ్ము, ధూళితో కూడిన రహదారులపై ప్రయాణీకులు దుర్భరమైన ప్రయాణాలు కొనసాగిస్తున్నారు.
తాత్కాలికంగా ఎగుమతుల నిలిపివేత
రావులపాలెం: మండలంలోని ఊబలంక ఇసుక ర్యాంపులో ఆదివారం తాత్కాలికంగా ఇసుక ఎగుమతులు నిలుపుదల చేశారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందుల్లేకుండా బాటలు సరిచేసే నిమిత్తం కూలీలు ఎగుమతులు నిలిపివేసి పనులు చేపట్టినట్టు తహసీల్దారు సిహెచ్ ఉదయ్‌భాస్కర్ తెలిపారు. సోమవారం నుండి యధావిధిగా ఎగుమతులు జరుగుతాయన్నారు. అయిదు యూనిట్ల లారీలకు ఎగుమతుల విషయంలో గత మూడు రోజులుగా వివాదం నడుస్తున్న నేపథ్యంలో లారీలకు ఎగుమతులు నిలిపివేసిన విషయం విదితమే. అయితే అయిదు యూనిట్ల లారీలకు ఎగుమతులు జరిపేలా తమకు ఇంతవరకు ఆదేశాలు రాలేదని తహసీల్దారు ఉదయభాస్కర్ తెలిపారు. బాట మరమ్మత్తుల నేపథ్యంలో ఆదివారం ఎగుమతులు నిలిపివేసిన విషయం తెలియక వచ్చిన కొందరు ట్రాక్టరు డ్రైవర్లు విషయం తెలుసుకుని వెనుతిరిగారు.