తూర్పుగోదావరి

రాయవరం-వెదురుపాక ఛానల్ పరిధిలో ఎండుతున్న పంటచేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయవరం, ఆగస్టు 21: ఖరీఫ్ పంటకు పూర్తిస్థాయిలో నీరందక చేలు నెరలు తీసి రైతులు పలు అవస్థలు పడుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని రాయవరం-వెదురుపాక ఛానల్ పరిధిలో వ్యవసాయం చేస్తున్న రైతులు ఆదివారం విలేఖరుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. చిరట్ల ఈశ్వరరావు, బర్ల అప్పలస్వామి, కుడుపూడి సూర్యనారాయణ, కొమిడిశెట్టి జాన్, మాధవరపు రామచంద్రరావు, తేతల వెంకటరెడ్డి తదితర రైతులు తెలిపిన వివరాల ప్రకారం రాయవరం-వెదురుపాక కాలువ పరిధిలో రాయవరంలో సుమారు 700 ఎకరాలు, వెదురుపాకలో 300 ఎకరాలు సాగవుతుండగా, ఈ ఛానల్‌పై వంతులవారీ నీరు విడుదల చేస్తున్నారన్నారు. పంటకు చాలనంత నీరందక చేలు బీటలు వారుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత వారంరోజులుగా విపరీతంగా కాస్తున్న ఎండలకు తోడు నీటి పారుదల సరిగా లేకపోవడంతో చేల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.