తూర్పుగోదావరి

మైనింగ్ డంపింగ్ పై రైతుల ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంఖవరం, ఆగస్టు 25: మండలంలోని నెల్లిపూడి శివారులో గల పంట పొలాల్లో డంపింగ్ యార్డు నిర్వహణపై నెల్లిపూడి, కొంతంగి రైతులు ఆగ్రహం వ్యక్తంచేసి పనులు అడ్డుకున్నారు. మైనింగ్ డంపింగ్ వల్ల తమ పొలాల్లోని పంట దెబ్బతింటుందని, తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండు చేశారు. మైనింగ్ రవాణా వల్ల రహదారులు దెబ్బతింటున్నాయని, ప్రజలు గాయాలపాలవుచున్నారని ఆరోపించారు. డంపింగ్ యార్డులోని వాహనాలను అన్నవరం పోలీసులకు అప్పగించారు. ఆందోళనలో టిడిపి నాయకులు నరాల శ్రీను, శృంగవరం, పల్లపుచామవరం సర్పంచ్‌లు వరహాలు, జట్లా రాజా, రైతులు పాల్గొన్నారు.
షోరూమ్‌లో కారు చోరీ
రావులపాలెం, ఆగస్టు 25: షోరూమ్‌లో అమ్మకం నిమిత్తం ఉంచిన కారును దొంగలు చోరీచేసిన ఘటన గురువారం రావులపాలెంలో వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. మారుతీ సుజుకీ కంపెనీకి సంబంధించి స్థానిక మార్కెట్టు యార్డు సమీపంలో జాతీయ రహదారి చెంతనగల ఒక భవనంలో షోరూమ్ నిర్వహిస్తున్నారు. ఎస్‌బి మోటార్స్ పేరుతో నిర్వహిస్తున్న ఈ షోరూమ్‌లో అమ్మకం నిమిత్తం సుమారు రూ.8లక్షలు విలువజేసే మారుతీ స్విఫ్ట్ డిజైర్ కారు ఉంచారు. బుధవారం రాత్రి ఎప్పటి మాదిరిగానే షోరూమ్ సిబ్బంది తాళాలువేసుకుని ఇళ్లకు వెళ్లారు. గురువారం ఉదయం వచ్చి చూసేసరికి షోరూమ్ ఒక వైపు షెట్టర్ తాళాలు పగలకొట్టి ఉన్నాయి. షెట్టర్ తెరచి చూసేసరికి కారు కనిపించలేదు. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సిఐ పివి రమణ, ఎస్సై పి వెంకటత్రినాధ్‌లు సిబ్బందితో అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. కాకినాడ నుండి క్లూస్ టీంను రప్పించి వేలి ముద్రలు సేకరించారు. అలాగే జాతీయ రహదారిపై ఈతకోట వద్దనున్న టోల్‌గేట్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటై ఉన్న సిసి కెమెరా పుటేజీలను పరిశీలించారు. సంస్థ జిఎం మద్దుల వెంకట సుబ్రహ్మణ్య శ్రీరామగుప్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై త్రినాధ్ తెలిపారు.