Others

నాకు నచ్చిన సినిమా -- ఏకవీర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వనాథ సత్యనారాయణ నవలా రూపంగా వచ్చిన సినిమా -ఏకవీర’. ఎన్టీఆర్, కాంతారావు, జమున, కెఆర్ విజయలు రెండు జంటలుగా ప్రేక్షకులను సమ్మోహనపరిచారు. దేవులపల్లి కృష్ణశాస్ర్తీ కలంనుండి జాలువారిన పాటలన్నీ ఆణిముత్యాలే. ప్రతీరాత్రి వసంతరాత్రి ప్రతి గాలి పైర గాలి, తోటలో నా రాజు తొంగి చూసెను నాడు, నీటిలో ఈరాజు నీడ నవ్వెను నేడు. నీ పేరు తలచినా చాలు, ఎదలో పొంగె శతకోటి యమునా తరంగాలు.. లాంటి పాటలు ఈ సినిమాను అజరామరం చేశాయి. అన్ని సినిమాలకు పాటలు రాసిన సి.నారాయణరెడ్డి ఈ చిత్రానికి మాటలు రాయడం మరో విశేషం. దాదాపు ఆరు దశాబ్దాలు దాటినా ఈ సినిమా గొప్పతనం చెక్కుచెదరలేదు. రేడియోలలోనే కాక టెలివిజన్లలో ప్రసారమవుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. కాశీ మజిలీ కథలోలాగ ఒకరు ప్రేమించిన వారిని మరొకరు పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో పాత్రల మధ్య సంక్లిష్టత ఈ సినిమాలో చక్కగా ఆవిష్కరించారు. మనసొకచోట, మనువొకచోట వుంటే జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో ఈ సినిమాలో చూడొచ్చు. కెఆర్ విజయ, జమున మనసులో రేగే బడబాగ్నులను దాచుకుంటూ పైకి స్ర్తి సహ ధర్మచారిణి తత్వాన్ని ప్రదర్శించే నటనలో అద్భుతంగా నటించారు. అదేవిధంగా రామారావు, కాంతారావు తమకిచ్చిన పాత్రలను ప్రేక్షకులకు నిరంతరం గుర్తుండేలా నటించారు. సినిమా ముగింపు ఎలావున్నా, గుండెల్లో ప్రేమవున్న ప్రతివారికీ నచ్చుతుంది. అందుకే నాకూ నచ్చింది.
-చోడవరపు రమాదేవి, హైదరాబాద్