ఎలావుందీ వారం?

ఎలావుందీ వారం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (ఏప్రిల్ 15 - మే 14)
సమాజంలో జరిగే మార్పులను గమనిస్తూ తగిన రీతిలో మీ వ్యవహారాలను మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఆధిపత్యం కోసం కాక సమానత్వం కోసం కృషి చేస్తే అధిక ఫలితాలు పొందగలరు. భట్రాజులను పక్కనపెట్టి క్రియాశీలక విషయాలు, కార్యక్రమాల పట్ల దృష్టి నిలపడం శ్రేయస్కరం. కుటుంబ విషయాలు ఆందోళన కలిగించేవిగా వున్నా అది తాత్కాలికమే. సమ్మేళనాలు, సంబరాలలో ఆత్మీయులతో కలిసి పాలుపంచుకుంటారు. ధన లోపం ఉండదు.

వృషభం (మే 15 - జూన్ 14)
ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. సోమ, మంగళ వారాల్లో అనుకోని వ్యక్తుల కలయిక, శుభ వర్తమానాలు, దైవదర్శనం, సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు మీలో ఉత్సాహాన్ని నింపుతాయి. ఉద్యోగ వృత్తి రంగాల్లో నిరాసక్తత పోయి ఉత్తేజకర పరిస్థితులు నెలకొంటాయి. నూతన ఆదాయ మార్గాలు, రుణ సదుపాయాలు ఏర్పడుతాయి. మీ ప్రతిభా పాటవాలను ప్రదర్శించడానికి తగిన అవకాశాలు లభిస్తాయి. మనశ్శాంతి లభిస్తుంది.

మిథునం (జూన్ 15 - జూలై 14)
సోదర బంధు వర్గాల వారి అవసరాల కోసం స్వ విషయాలను పక్కన పెట్టవలసి వస్తుంది. వృత్తి వాణిజ్యాలలో సందిగ్ధావస్థ నెలకొన్నా త్వరలో సమస్యలు పరిష్కరింపబడతాయి. 2,3 తేదీల్లో కొత్త తరహా వ్యవహారాలను చేపడతారు. కుటుంబ విషయాల్లో సహనం, ఓపిక ప్రదర్శిస్తే మీరాశించిన మార్పులను తీసుకు రాగలుగుతారు. వ్యతిరేకతలను, వత్తిడులను తట్టుకుని త్వరలో అన్ని రంగాల్లో మీ ప్రాధాన్యతను చాటిచెప్పగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది.

కర్కాటకం
స్థిరత్వం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయని ఆశించవచ్చు. భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకుంటారు. మీ అభిప్రాయాలను అర్థం చేసుకుని అన్ని వర్గాల వారి పురోగతికై కృషి చేస్తారు. పిల్లల విద్యా సంబంధ విషయాల్లో ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. పోటీలలో, ప్రచారాలలో మీ ప్రతిభకు తగ్గ ఫలితాలు అందుతాయి. గౌరవ పురస్కారాలు, పదోన్నతికి ఆస్కారాలు అధికం. ఆదాయం పెరుగుతుంది. విశ్వాసపాత్రులయిన అనుచర గణం ఏర్పరచుకో గలుగుతారు.

సింహం (ఆగస్టు 14 - సెప్టెంబర్ 14)
స్థిరమైన ఆలోచనలు, నిర్ణయాల ద్వారా భవిష్యత్తుకు పునాదులు వేసే ప్రయత్నం ప్రారంభిస్తారు. స్ర్తిలు, సన్నిహితులు మీకు ఆలంబనగా నిలుస్తారు. వినోద విజ్ఞాన రంగాల్లో మీ ప్రాబల్యం పెరుగుతుంది. పలుకుబడిగల వ్యక్తుల సహకారంతో మీ సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. వారమంతా తీరిక లేనంతగా పనిచేయడం తప్పకపోయినా సాధించిన విజయాలు మీకు ఉల్లాసాన్నిస్తాయనవచ్చు. అనుకోని అవాంతరాల వల్ల పనులు కొన్ని శుక్ర, శనివారాల్లో వాయిదా పడవచ్చు.

కన్య ( సెప్టెంబర్ 15- అక్టోబర్ 14)
ఆగిపోయిన బాకీలు, క్లెయిములు ఈ వారంలో మీ చేతికందవచ్చు. ప్రత్యర్థుల వత్తిడిని తట్టుకుని మీ ప్రాధాన్యతను నిలుపుకో గలుగుతారు. ఉష్ణ, వాత సంబంధ రుగ్మతలు 2,3 తేదీల్లో తలెత్తవచ్చు. బంధు మిత్ర వర్గాలు మీకు దన్నుగా నిలవడంతో వారంలో అధిక భాగం ప్రోత్సాహకరంగా గడచిపోతుంది. స్పెక్యులేషన్, క్రీడలు, వేడుకలు మీలోని కార్యదక్షత, దూర దృష్టికి అద్దం పట్టేవిగా ఉంటాయి. భాగస్వాముల అవసరాలను గమనించండి.

తుల (అక్టోబర్ 15- నవంబర్ 14)
జీవిత భాగస్వాముల, సన్నిహితుల అభిమతాలను, అవసరాలను మన్నించి సహకరిస్తారు. ముఖ్య నిర్ణయాలను తీసుకుని అమలుపరచడానికి సమాయత్తమవుతారు. బహుకాల కోరికలు, సంకల్పాలు ఈ వారంలో ఈడేరవచ్చు. ఆత్మీయులతో ప్రేమానుబంధాలు ఇనుమడిస్తాయి. పెద్దలు, అధికారులు మీ ప్రాధాన్యతను, ప్రావీణ్యతను గుర్తిస్తారని ఆశించవచ్చు. శుక్ర, శనివారాల్లో పనుల వత్తిడి, త్రిప్పట, అనుకోని ఖర్చులు ఉంటాయి.

వృశ్చికం (నవంబర్ 15-డిసెంబర్ 14)
స్థిరాస్తి లావాదేవీలు, గృహాభివృద్ధికి ప్రయత్నాలు ఈ వారంలో ప్రాముఖ్యత సంతరించుకుంటాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు కొన్ని అనూహ్యంగా తెరపైకి వస్తాయి. స్ర్తిలు, పిల్లల ద్వారా ఉల్లాసం, ఆనందం లభ్యమవుతాయి. విద్యా వాణిజ్యాలలో శ్రమ పెరిగినా కృషికి తగ్గ ఫలితాలుంటాయనడంలో సందేహం లేదు. నూతన బాధ్యతలు స్వీకరించే సూచనలున్నాయి. వివిధ రకాల ప్రణాళికలను అమలుపరచడంలో వారమంతా బిజీగా ఉంటారనవచ్చు.

ధనస్సు (డిసెంబర్ 15-జనవరి 14)
అభివృద్ధి పథకాలు, ప్రణాళికలు తయారుచేసుకుంటారు. వాయిదా పడిన కార్యక్రమాలు తిరిగి ప్రాధాన్యత సంతరించుకుంటాయి. మీ సాహచర్యంలో కుటుంబ సభ్యులు ఉల్లాసానందాలను పొందగలుగుతారు. దూర ప్రయాణాలు, ఆధునిక పరికరాలు అమర్చుకోవడానికి తగిన వనరులు సమకూరడం, చిరకాల వాంఛలు కొన్ని తీరడం, క్రీడలలో రాణించడం గురు, శుక్రవారాల్లో జరుగవచ్చు. ఉద్యోగస్థులు, అధికారుల వత్తిడి, అనవసర ఖర్చుల వల్ల సతమతమవుతారు. సంఘంలో పరపతి పెరుగుతుంది.

మకరం (జనవరి 15-ఫిబ్రవరి 14)
కొంతకాలంగా నలుగుతున్న వ్యవహారాలు ఈ వారంలో పూర్తవుతాయి. నిర్దిష్ట ప్రణాళికలు, పెద్ద మొత్తాల్లో ధనం చేతికందడం, గృహోపకరణాలు, విలాసాలు సమకూరడం సోమ, మంగళ వారాల్లో మీలో చైతన్యాన్ని నింపుతాయి. వృత్తి, వాణిజ్యాల్లో మీ మాట చెల్లుబాటు కావడం, గౌరవాదరణలు పెరగడం గమనించవచ్చు. దేవాలయాలు, రమణీయ స్థలాలను సందర్శించి ఉల్లాసం పొందుతారు. ప్రజాహిత కార్యక్రమాలు, పండుగలు, కళాకారులతో పరిచయాలు ఆనందాన్నిస్తాయి.

కుంభం (ఫిబ్రవరి 15-మార్చి 14)
వారంలో అధిక భాగం మీరాశించిన రీతిలో కార్యక్రమాలు నిర్వహించ గలుగుతారు. ఇంటా బయటా ప్రోత్సాహకర పరిణామాలేర్పడుతాయి. ఆశించిన శుభవర్తమానాలు అందుకుంటారు. ప్రమోషన్లు, ఆశించిన చోటుకి బదిలీలు జరగడం ఈ వారంలో అనుభవానికి వస్తాయి. సోదర వర్గంతో మాట పట్టింపులు, పొరపొచ్చాలు రాకుండా చూసుకోండి. భాగస్వాములతో మీ అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకుని భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు. నేత్ర సంబంధ ఇమ్బందులు తలెత్తవచ్చు.

మీనం ( మార్చి 15- ఏప్రిల్ 14)
సన్నిహితుల మధ్యవర్తిత్వంతో కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. ఇతరులు మీపై ఉంచిన బాధ్యతలు నిరాటంకంగా నిర్వహించ గలుగుతారు. మొండి బాకీలు కొన్ని వసూలవుతాయనవచ్చు. రవాణా సర్వీసులు, కళారంగాల ద్వారా ఆదాయం పెరిగే సూచనలున్నాయి. సంక్షేమ, విద్యా, వాణిజ్య కార్యక్రమాలు మీ ప్రతిభను వెలికితీసేవిగా ఉంటాయనవచ్చు. బ్యాంకు లావాదేవీలు, రుణ సేకరణలో ఏమరపాటు పనికిరాదు. వ్యవహారాలు సంతృప్తికరంగా నిర్వహించి పెద్దల, అధికారుల మెప్పు పొందుతారు.

ఎస్.రవిప్రకాశ్