తెలంగాణ

‘పుర’ ఎన్నికల్లో తెరాస జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగర పాలక సంస్థలకు, అచ్చంపేట నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు పూర్తి ఆధిక్యతలో నిలిచారు. వరంగల్‌లో 58 డివిజన్లు ఉండగా, ఇప్పటివరకు తెరాస 29, కాంగ్రెస్ 3, బిజెపి 2, ఇతరులు 6 డివిజన్లలో గెలిచారు. ఖమ్మంలో 50 డివిజన్లు ఉండగా, తెరాస 34, కాంగ్రెస్ 10, సిపిఎం, సిపిఐ, వైకాపా చెరో రెండు స్థానాల్లో గెలిచారు. ఖమ్మం, వరంగల్‌లలో టిడిపి ఇంతవరకూ ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేదు. ఈ రెండు కార్పొరేషన్లలో ఇప్పటికే తెరాస పూర్తి మెజారిటీ సాధించడంతో మేయర్, డిప్యూటీ పీఠాలను కైవసం చేసుకొనే పరిస్థితి ఏర్పడింది. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 20 వార్డుల్లోనూ తెరాస అభ్యర్థులే గెలిచారు. ఈ నెల ఆరున ఈ మూడుచోట్ల ఎన్నికలు నిర్వహించగా, బుధవారం ఉదయం కౌంటింగ్ ప్రారంభమైంది.