రాష్ట్రీయం

విద్యుత్ చార్జీలు పెంచాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూ.5,148 కోట్ల లోటు
శ్లాబ్‌ల స్థానంలో గ్రూపులు
ఏపిఇఆర్‌సికి డిస్కాంల ప్రతిపాదన
ప్రభుత్వం భరించే సబ్సిడీపై సస్పెన్స్
త్వరలో బహిరంగ విచారణ తేదీల ఖరారు

హైదరాబాద్, డిసెంబర్ 31: వచ్చే ఏడాది విద్యుత్ చార్జీలు పెంచేందుకు వీలుగా రూ.5148 కోట్ల లోటు ఉన్నట్లు చూపుతూ ఆంధ్ర డిస్కాంలు గురువారం ఏపిఇఆర్‌సికి ఇక్కడ వార్షిక రెవెన్యూ నివేదికలో ప్రతిపాదనలు సమర్పించాయి. దీంతో రూ.5148 కోట్లలో ప్రభుత్వం ఏ మేర వ్యవసాయ విద్యుత్ సబ్సిడీని, ఇతర సబ్సిడీని భరిస్తుందో సస్పెన్స్‌గా మారింది. కనీసం మూడున్నరవేల కోట్ల రూపాయల సబ్సిడీని రాష్ట్రప్రభుత్వం భరించినా, రూ.1500 కోట్లమేర విద్యుత్ చార్జీల వడ్డన తప్పదు. ఏపి డిస్కాంలు ప్రతిపాదించిన వార్షిక నివేదికలో ఆసక్తికరమైన వివరాలు ఉన్నాయి. 2016-17 సంవత్సరానికి మొత్తం రూ.28,423 కోట్లు అవసరమని, కాని రెవెన్యూ రూ.23,275 కోట్లు మాత్రమే వస్తుందని పేర్కొంది.
దీంతో రూ.5148 కోట్ల లోటును పూడ్చుకునేందుకు టారిఫ్‌ను పెంచడం మినహా గత్యంతరం లేదని పేర్కొంది. ఒక యూనిట్ విద్యుత్ సరఫరా చేయాలంటే రూ 5.60 పైసలు ఖర్చవుతోందని, కాని వినియోగదారుల నుంచి యూనిట్‌కు రూ.4.59 పైసల ఆదాయమే వస్తోందన్నారు. దీనివల్ల రెవెన్యూ లోటు ఒక యూనిట్‌కు రూ.1.01 పైసలు ఏర్పడుతోంది.
ప్రస్తుతం అమలులో ఉన్న శ్లాబ్‌లను ఎత్తివేసి మూడు గ్రూపులుగా వినియోగదారుల విద్యుత్ వినిమయాన్ని బట్టి ఖరారు చేయాలని ఏపి డిస్కాంలు ప్రతిపాదించాయి. కాని దీనికి సంబంధించిన విధి విధానాలను త్వరలో ఖరారు చేస్తామన్నారు. సింగిల్ ఫేజ్ కింద సాలీనా ఆరు వందల యూనిట్ల వరకు వినియోగించేవారు గ్రూప్-ఏ కింద వస్తారు. 600 నుంచి 2400 యూనిట్ల మధ్య వినిమయం చేసే వారు గ్రూప్ బి కేటగిరీలో వస్తారు.
2400 యూనిట్లకుపైన విద్యుత్‌ను వినిమయం చేసే వినియోగదారులను గ్రూప్ సి కేటగిరీలో చేర్చుతారు. 2015-16 సంవత్సరంలో వినియోగదారులు విద్యుత్‌ను వినిమయం చేసిన దానిని బట్టి వారి కేటగిరీని ఖరారు చేస్తారు. ఈ వివరాలను త్వరలోనే ఏపిఇఆర్‌సికి సమర్పిస్తామన్నారు. రాష్ట్రంలో 57,565 ఎంయు విద్యుత్ అవసరమని, కాని 66,839 ఎంయు విద్యుత్ అందుబాటులో ఉందని, 9274 ఎంయు విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉందని ఏపి డిస్కాంలు నివేదికలో పేర్కొన్నాయి. దాదాపు 7142 ఎంయు విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు అమ్మేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమర్ధంగా క్యాపిటల్ మేనేజిమెంట్ కోసం వినియోగదారుల భద్రత డిపాజిట్‌ను రెండు నెలల నుంచి 75 రోజులకు పెంచుతున్నట్లు చెప్పారు. హిందూజా, కృష్ణపట్నం నుంచి వంద శాతం అంటే 16,568 ఎంయు విద్యుత్ కేటాయింపులు జరిగాయన్నారు.