జాతీయ వార్తలు

అక్టోబర్ 21నమహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబరు 21న మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరా తెలిపారు. రెండు రాష్ర్టాల్లో అక్టోబర్‌ 24న ఓట్ల లెక్కింపు ఉంటుందని, అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయని ఈ రెండు రాష్ర్టాల ఎన్నికల నోటిఫికేషన్‌ సెప్టెంబర్‌ 27న విడుదల కానుందని ఆయన చెప్పారు. నామినేషన్లకు చివరి తేదీ అక్టోబర్‌ 4. హర్యానా అసెంబ్లీకి నవంబర్‌ 2వ తేదీతో, మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్‌ 9వ తేదీతో గడువు ముగియనుంది అని తెలిపారు. మహారాష్ట్రలో 288, హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. మహారాష్ట్రలో 8.94 కోట్ల మంది, హర్యానాలో 1.82 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.