కృష్ణ

ఏలూరు కాలువ మళ్లింపుపై ఆచితూచి అడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* భవిష్యత్‌లో పడవలో వెళ్లేందుకు కూడా అవకాశం
విజయవాడ, మార్చి 11: ఇన్‌లాండ్ వాటర్ వేస్, ఎయిర్ పోర్టు విస్తరణ పరిగణనలోని విమానాశ్రయం సమీపంలోని ఏలూరు కాలువ మళ్లింపునకు ఎలైన్‌మెంట్ చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బాబు ఎ తెలిపారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణలో భాగంగా ఏలూరు కాలువ మళ్లింపు ఎలైన్‌మెంట్‌పై నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ బాబు ఎ గన్నవరం శాసనసభ్యులు డా.వల్లభనేని వంశీమోహన్, జలవనరుల శాఖ నిపుణుల కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర నూతన రాజధాని అభివృద్ధిలో భాగంగా గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. విమానాశ్రయ విస్తరణకు సంబంధించి అవసరమైన భూమిని సేకరించేందుకు రైతులు సహకరించటం అభినందనీయమన్నారు. విమానాశ్రయం సమీపంలోని ఏలూరు కాలువను మళ్లించవలసిన అవసరం ఉందన్నారు. నేవిగేషన్ పరిధిలో ఉన్న ఏలూరు కాలువను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఇన్‌ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు పడవలను నడిపేందుకు అనువుగా తీర్చిదిద్దాల్సి ఉందన్నారు. ఏలూరు కాలువ ఎలైన్‌మెంట్‌పై నిర్ణయం తీసుకునేందుకు జలవనరుల శాఖకు చెందిన నిపుణులతో కమిటీని నియమించటం జరిగిందన్నారు. కమిటీ సభ్యులు దీనిపై ప్రాథమిక నివేదిక ఇవ్వటం జరిగిందన్నారు. శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్ మాట్లాడుతూ రాజధాని అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావల్సిన అవసరం ఉందన్నారు. అయితే అభివృద్ధి పనులకు సంబంధించి భూములు అందించేందుకు ముందుకు వచ్చే రైతులకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఏలూరు కాలువ ఎలైన్‌మెంట్‌పై రైతుల సందేహాలను నివృత్తి చేసి కాలువ మళ్లింపు చేయటం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గంథం చంద్రుడు, జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ వైఎస్ సుధాకర్, ఎస్‌ఇ సి.రామకృష్ణ, నిపుణుల కమిటీ కెవి సుబ్బారావు, ఆర్.సత్యన్నారాయణ, యం.గిరిధర్ రెడ్డి, గన్నవరం తహశీల్దార్ యం.మాధురి, సర్వేయర్ ఎస్.విజయవర్మ, రైతు ప్రతినిధులు జి.నరసింహరావు, ఎంఎల్ ప్రసాద్, డి.సుబ్బారావు పాల్గొన్నారు.