తెలంగాణ

ఎంసెట్-2 లీకేజీ ప్రచారంపై సిఐడి దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎంబిబిఎస్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశానికి తెలంగాణ సర్కారు నిర్వహించిన ఎంసెట్-2లో అక్రమాలు జరిగాయన్న ప్రచారంలో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు ఇక సిఐడి విభాగం రంగంలోకి దిగనుంది. ఈ వ్యవహారంపై సిఐడి పోలీసులు విచారణ జరపాలని డిజిపి అనురాగ్‌శర్మ బుధవారం ఆదేశించారు. కోచింగ్ సెంటర్‌లో తక్కువ ప్రతిభ చూపిన విద్యార్థులకు ఎంసెట్-2లో మంచి ర్యాంకులు వచ్చాయని, పరీక్షకు వారం రోజుల నుంచి కొందరు విద్యార్థులు కోచింగ్ కేంద్రాలకు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉంటూ లీక్ అయిన పేపర్‌తో బాగా ప్రిపేర్ అయ్యారన్న ప్రచారం మీడియాలో జరిగింది. ప్రశ్నపత్రాన్ని లక్షలాది రూపాయలకు అమ్ముకున్నారన్న ప్రచారంపై విచారణ జరపాల్సిందిగా ఎంసెట్ కన్వీనర్ రమణారావు బుధవారం నాడు డిజిపిని కలిసి విజ్ఞప్తి చేశారు. మరోవైపు జెఎన్‌టియు కూడా అంతర్గతంగా విచారణ జరుపుతోంది.