రాష్ట్రీయం

సమీపిస్తున్న డెడ్‌లైన్.. ఉద్యోగుల్లో ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: హైదరాబాద్, తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగులు సొంత రాష్ట్రానికి వచ్చేందుకు డెడ్‌లైన్ 2017 జూన్ 2వ తేదీతో ముగుస్తుంది. ఆ తేదీ లోపల వచ్చి అక్కడ రిపోర్టు ఇచ్చిన వారి పిల్లలకు స్థానికత వస్తుంది. ఈ నిబంధన ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ఉద్యోగులకు ఈ వెసులుబాటును కల్పిస్తూ రాష్టప్రతి గత ఏడాది ఉత్తర్వులు ఇచ్చారు. ఈ గడువు ఈ ఏడాది జూన్ 2తో ముగుస్తుంది. కాని హైకోర్టు ఇంకా విభజన కాలేదు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులు పెద్దసంఖ్యలో హైకోర్టులో పనిచేస్తున్నారు. అలాగే 9, 10 షెడ్యూళ్లలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్ధలు, కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇంకా ఇక్కడ పనిచేస్తున్నాయి. జూన్ 2లోగా ఈ సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆంధ్రకు వెళ్లేందుకు వీలులేదు. అలాగే తెలంగాణ ప్రాంతంలో పోలీసు శాఖలో డిఎస్పీ, సిఐ కేడర్‌లో అనేకమంది ఏపివారు పనిచేస్తున్నారు. పదోన్నతుల విషయంలో అనేక వివాదాలు ఉన్నాయి. ఈ వివాదం తేలకుండా జూన్ 2లోపల వచ్చినవారే లోకల్ అంటే ఆ తర్వాత తమ సమస్యలు పరిష్కారమైతే భవిష్యత్తులో ఇక్కట్లు ఎదుర్కొంటామని ఉద్యోగులంటున్నారు. దాదాపు 1200 మంది ఉద్యోగులు తమను చట్టవిరుద్ధంగా తెలంగాణకు కేటాయించారని కోర్టుకు వెళ్లిన వారున్నారు. కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 2014 జూన్ 2వ తేదీ నుంచి 2017 జూన్ 2వ తేదీ లోపల ఆంధ్రాకు వచ్చే ప్రభుత్వ ఉద్యోగులే లోకల్ అవుతారని నిర్వచనం ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చింది. దీనివల్ల స్ధానికత లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఉన్నత విద్యా సంస్ధల్లో లోకల్ కోటా కింద మెరిట్ వస్తే సీటు వస్తుంది. పబ్లిక్ సర్వీసు కమిషన్ ఉద్యోగాల్లో కూడా లోకల్ ప్రాతిపదికన గుర్తింపు ఉంటుంది. ఏపి పునర్విభజన చట్టంలో సెక్షన్ 108 (1) అనే నిబంధన ఉంది. చట్టంలో ఎన్ని నిబంధనలు ఉన్నా, రాష్టప్రతి వాస్తవ పరిస్థితులు పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులు జారీ చేయవచ్చు. కాని అదికూడా మూడు సంవత్సరాల వరకే పరిమితం. మూడేళ్ల తర్వాత అంటే 2017 జూన్ 2వ తేదీ తర్వాత రాష్టప్రతి ఉత్తర్వులు కూడా పనిచేయవు. పార్లమెంటు ద్వారా మాత్రమే చట్టం చేసి విభజన వల్ల ఎదురవుతున్న సమస్యలను తొలగించాల్సి ఉంటుంది. ఈ నిబంధన ఉద్యోగుల్లో అలజడిని పెంచుతోంది. రాష్టప్రతి ఇంతవరకు 108 సెక్షన్ కింద మూడు ఉత్తర్వులుజారీ చేశారు.