ఆంధ్రప్రదేశ్‌

ఆగస్టు నాటికి ఉద్యోగుల తరలింపు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: ఈ ఏడాది ఆగస్టు నాటికి హైదరాబాద్ నుంచి ఎపి ఉద్యోగుల తరలింపు ప్రక్రియ పూర్తవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం మీడియకు తెలిపారు. ఆయన వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణం పనులను పరిశీలించారు. కొన్ని ఇబ్బందులున్నా ఉద్యోగులంతా ఇక్కడికి తరలివస్తారని, వెలగపూడిలో సచివాలయం తాత్కాలికమే అయినా భవనాలను మాత్రం శాశ్వత ప్రాతిపదికలో నిర్మిస్తున్నామన్నారు. ఐటి కంపెనీల్లో మాదిరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రహదారులను విస్తరించే సందర్భంగా ఆక్రమణలను తొలగించినపుడు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని, ప్రతీ విషయాన్ని మీడియా సహాయంతో వివాదాస్పదం చేయడం మంచిది కాదన్నారు. పుష్కరాల సందర్భంగా విజయవాడలో కొన్ని ఆలయాలను తొలగించిన విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఏ వర్గానికీ ప్రభుత్వం వ్యతిరేకం కాదన్నారు. వివాదాలను రగిలించే వారిపట్ల జనం అప్రమత్తంగా ఉండాలన్నారు.