బిజినెస్

విద్యుత్ ఇంజనీర్ల స్కిల్ డెవలెప్‌మెంట్‌కు రూ. 60 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంజూరు చేసిన ప్రపంచ బ్యాంకు
ఏపి ఇంధన కార్యదర్శి సలహాదారు వెల్లడి

విశాఖపట్నం, డిసెంబర్ 29: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యతతో కూడిన సేవలందించేందుకు వీలుగా ఇంజనీర్ల వృత్తి నైపుణ్యతను పెంపొందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన కార్యదర్శి సలహాదారు కె రంగనాథమ్ అన్నారు. ఏపిఎస్‌ఇబి ఇంజనీర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీర్ల వృత్తి నైపుణ్యత పెంపునకు 60 కోట్ల రూపాయల మేర ప్రపంచ బ్యాంకు నిధులు మంజూరయ్యాయన్నారు. విద్యుత్ రంగంలో ఉద్యోగులు తమ సామర్థ్యాన్ని చూపడం ద్వారా ఫలితాలు సాధించాల్సి ఉందన్నారు. సత్వరమే విద్యుత్ సర్వీసులు మంజూరు చేయాలని, ముఖ్యంగా పరిశ్రమలకు నాణ్యమైన సేవలందించాలని రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులు, ఇంధన కార్యదర్శులు ఢిల్లీలో జరిగే సమావేశాల్లో చెబుతున్నారన్నారు. కాగా, దేశంలో మరెక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈపిడిసిఎల్, ఎస్‌పిడిసిఎల్‌లకు తొమ్మిదికిపైగా అవార్డులు రావడంపట్ల ఆయన హర్షం వ్యక్తంచేశారు. విద్యుత్ లైన్ల నష్టాలు తగ్గించడంలో ఎస్‌పిడిసిఎల్ నాల్గవ స్థానానికి చేరుకుంటోందని, అదే సమయంలో ఈపిడిసిఎల్ ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రేవు ముత్యాలరాజు మాట్లాడుతూ ఎటువంటి సమీక్షలు జరపకుండానే చక్కటి ఫలితాలు ఏ విధంగా వస్తున్నాయంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆశ్చర్యం వ్యక్తం చేయడం తమ సంస్థకు మరింత స్ఫూర్తినిస్తోందన్నారు. ఏకంగా 45 నిమిషాలపాటు విద్యుత్ రంగం గురించే సిఎం ప్రసంగించారని గుర్తుచేశారు. పేపర్‌లెస్ డిస్కమ్‌గాను, మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టడంలోను, ఎల్‌ఇడి బల్బుల పంపిణీలోను దేశంలో ఉండే 48 డిస్ట్రిబ్యూషన్ కంపెనీల్లో తమ సంస్థ అగ్రగామిగా నిలిచిందన్నారు. నూతన సంవత్సరం కానుకగా ఈపిడిసిఎల్ పరిధిలో పనిచేసే ఐదు జిల్లాలకు చెందిన కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతినెల ఒకటవ తేదీ నాటికి జీతాలు చెల్లించే విధానం అమల్లోకి వస్తుందన్నారు.