బిజినెస్

ఇపిఎఫ్ వడ్డీ తగే గప్రసక్తే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: ఉద్యోగుల భవిష్య నిధి సంస్ధ (ఇపిఎఫ్‌ఓ) వడ్డీ రేటును 8.8 శాతనికి పెంచుతూ మధ్యంతర ఉత్తర్వులు తీసుకువస్తున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. న్యూఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇపిఎఫ్‌ఓ వడ్డీ రేటును 9 శాతనికి పెంచాలని కార్మిక సంఘాలు కోరాయని, అయితే దీని వలన ఉద్యోగుల భవిష్య నిధి సంస్ధకి రూ,102 కోట్లు నష్టం వస్తుందని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అందరితో చర్చించిన తర్వాతే వడ్డీరేటు 8.8 శాతనికి పెంచినట్లు దత్తాత్రేయ వివరించారు. భవిష్యత్తులో వడ్డీరేటును పెంచుతామే తప్ప తగ్గించే అవకాశం లేదని, కార్మికులకు నష్టం జరిగేలా ఏ నిర్ణయం తీసుకోబోమని అయన స్పష్టం చేశారు. కేంద్రనికి ప్రతీ సంవత్సరం రూ,980 కోట్లు అదనపు బారం పడుతున్నా కార్మికుల శ్రేయస్సు దృష్టీలో పెట్టుకుని పింఛన్ ఇస్తున్నట్లు దత్తాత్రేయ చెప్పారు. కార్మికులకు డబుల్ బోనస్‌ను రూ.3,500 నుండి రూ.7,000కు పెంచిన ఘానత ఎన్డీయే ప్రభుత్వనిదేనన్నారు.
పుర్రె గుర్తుపై పునఃపరిశీలన చేయాలి..
ఇదిలావుంటే, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి.నడ్డాతో దత్తాత్రేయ భేటీ అయ్యారు. బీడీ కట్టలపై ముద్రించే పుర్రె గుర్తు పరిమాణాన్ని 80 శాతనికి పెంచుతూ జారీ చేసిన జీఓ వలన ఆ రంగానికి చెందిన కార్మికులు నష్ట పోతున్నరని, కనుక దీనిపై పునఃపరిశీలన చేయాలని నడ్డాకు విజ్ఞప్తి చేసినట్లు దత్తాత్రేయ చెప్పారు. ఈ జీఓను వ్యతిరేకిస్తూ బీడీ కార్మికులు నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నరని, సూమరు రెండు కోట్లు మంది ఇబ్బందులు పడుతున్నరని మంత్రికి వివరించినట్లు దత్తాత్రేయ తెలిపారు. భవిష్యత్తులో బీడీ పరిశ్రమకు బదులుగా ప్రత్యామ్నాయ ఎర్పాట్లు చేసి కార్మికులను రాష్ట్ర ప్రభుత్వాలు అదుకోవాలని దత్తాత్రేయ సూచించారు.
కేంద్రమే అదుకోవాలి : వేణుగోపాలచారి
తెలంగాణలో సమ్మె చేస్తున్నా బీడీ కార్మికులను కేంద్ర ప్రభుత్వమే అదుకోవాలని కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, జెపి.నడ్డా, బండారు దత్తాత్రేయలను కోరినట్లు ఢిల్లీలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి తెలిపారు. శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ, బీడీ కట్టలపై పుర్రె గుర్తు పరిమాణాన్ని పెంచడం పునరలోచన చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.