జాతీయ వార్తలు

ఈశాన్య రాష్ట్రాల్లో భూప్రకంపనలు : ఆరుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి : ఈశాన్య రాష్ట్రాలైన అస్సోం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్ ప్రాంతాలతోపాటు బంగ్లాదేశ్‌లోనూ సోమవారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. మణిపూర్‌లో ఉదయం 9 గంటల తర్వాత మరోసారి కూడా భూమి కంపించింది. తెల్లవారు జామున వచ్చిన భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. పశ్చిమబెంగాల్‌లోని సిలిగురి ప్రాంతంలోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటికి వచ్చారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ఓ భవనం కుప్పకూలగా ఆరుగురు మరణించారు. సుమారు 100 మంది గాయపడ్డారు. భూప్రకంపనల గురించి ప్రధాని నరేంద్ర మోదీ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. హోంమంత్రిత్వ శాఖ అధికారులు దిల్లీలో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు దిల్లీ నుంచి ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను తరలించారు.