రాష్ట్రీయం

ఆటో డ్రైవర్లకు ఇఎస్‌ఐ సదుపాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇఎస్‌ఐ మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం తెలంగాణ
ప్రభుత్వంతో ఇఎస్‌ఐసి అవగాహన ఒప్పందం
ముద్రయోజన పథకం కింద రూ.15 కోట్ల రుణాలకు కేంద్రం ప్రణాళిక
వెల్లడించిన కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి దత్తాత్రేయ

హైదరాబాద్, మార్చి 12: ఆటో రిక్షా డ్రైవర్లకు ఇఎస్‌ఐ వైద్య సదుపాయాన్ని కల్పించేందుకు కేంద్రప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు త్వరలో నోటిఫికేషన్ జారీ అవుతుందని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. దేశంలో పైలెట్ ప్రాజెక్టుగా ఢిల్లీ, హైదరాబాద్‌లో ఆటో రిక్షా డ్రైవర్లకు ఇఎస్‌ఐ వైద్య సౌకర్యం కల్పించేందుకు నిర్ణయించామని వెల్లడించారు. శనివారం నాడిక్కడ సనత్‌నగర్ నగర్, నాచారం ఇఎస్‌ఐ హాస్పిటళ్లలో జరిగిన అవగాహన ఒప్పందం (ఎంఓయు) కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ త్వరలో అసంఘటిత కార్మికులుగా ఉన్న నిర్మాణ రంగం కార్మికులు, గృహనిర్మాణ పనివార్లు, ఆశా వర్కర్లు, మధ్యాహ్నా భోజన కార్మికులు వంటి వారికి సామాజిక భధ్రత కల్పించే ప్రతిపాదన ఉందని అన్నారు.
తెలంగాణ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరక్టర్ డాక్టర్ దేవికారాణి, ఇఎస్‌ఐసి అధికారి దేశ్‌పాండేలు సనత్‌నగర్ ఇఎస్‌ఐ హాస్పిటల్ వద్ద మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుని పేపర్లను మార్చుకున్నారు. ఇఎస్‌ఐసి మెడికల్ కాలేజీని మోడల్ హాస్పిటల్‌గా అభివృద్ధి చేస్తామని మంత్రి దత్తాత్రేయ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ముద్ర యోజన పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.15 కోట్ల రుణాలు దేశవ్యాప్తంగా పంపిణీ చేయాలని ప్రణాళిక సిద్ధం చేసిందని కేంద్రమంత్రి దత్తాత్రేయ తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్‌లో సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.1.85 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేటాయించిన సంగతిని మంత్రి గుర్తు చేశారు. శనివారం నాడిక్కడ బ్యాంకర్ల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముద్ర యోజన రుణాల పంపిణీపై సమీక్షించారు.
ఈ పథకం కింద 3కోట్ల మంది లబ్దిపొందారని తెలిపారు. ముఖ్యంగా మహిళలను వ్యాపార రంగంలో ప్రోత్సహించేందుకు గాను ఈ రుణాలను అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.