జాతీయ వార్తలు

ఇవిఎంల హ్యాకింగ్ అసాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 31: దేశవ్యాప్తంగా ఎన్నికల ఓటింగ్ యంత్రాల నిష్పాక్షికతపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వీటిని తయారు చేస్తున్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ చాలా స్పష్టమైన రీతిలోనే ఒక ప్రకటన చేసింది. ఇవిఎంలు అత్యంత సురక్షితమైనవని, వీటిని ట్యాంపర్ చేసేందుకు ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేసింది. భారత ఎన్నికల కమిషన్ చేసిన ప్రత్యేక సూచనలు, సలహాల ప్రకారమే వీటిని రూపొందించడం జరిగిందని, వీటి తయారీలో అన్ని రకాల జాగ్రత్తలను, తనిఖీలను చేయడం కూడా జరిగిందని బిఇఎల్ సిఎండి సిఇఓ ఎంవి గౌతమ బుధవారంనాడు మీడి యా సమావేశంలో తెలిపారు. ఎలక్ట్రానిక్ యంత్రాలను మనకు ఏ విధంగా కావాలిస్తే ఆ విధంగా తయారుచేసుకోవచ్చునని, అయితే ఇవిఎంలను భారత ఎన్నికల వ్యవస్థ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేయడం జరిగిందని చెప్పారు. ఈ యంత్రాలను సాంకేతిక నిపుణుల కమిటీ పరీక్షించిందని, వాటి నాణ్యతను ప్రభుత్వ సంస్థ ఎన్‌టిక్యూసీ ధ్రువీకరించిందని కూడా ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో తమ యంత్రాలను హ్యాక్ చేయడానికి గాని, ట్యాంపర్ చేయడానికి గాని ఎలాంటి అవకాశం లేదని అన్నారు.
ఇవిఎంలను చాలా తేలిగ్గానే హ్యాక్ చేయవచ్చం టూ దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు సవాలు విసిరిన నేపథ్యంలో బిఇఎల్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత చేకూరింది. సాధ్యమైతే ఇవిఎంలను హ్యాక్ చేయాలంటూ రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ సవాలు విసరడం, కేవలం ఒకటి, రెండు పార్టీలు మాత్రమే ఇందుకు ముందుకు రావడం తెలిసిందే. ఎన్‌సిపి, సిపిఎంలు మాత్రమే ఎన్నికల కమిషన్ విసిరిన సవాలును స్వీకరిస్తున్నాయి. జూన్ 3న జరిగే ఈ సవాల్లో పాల్గొంటున్నాయి. అయితే, తాము కొన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలను సూచించడానికి ఈ సవాల్‌లో పాల్గొంటున్నామని, హ్యాకింగ్ పరీక్షలో పాలు పంచుకునేది లేదని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు.