కృష్ణ

సారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎకొండూరు, ఏప్రిల్ 15: సారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని రాష్ట్ర ఎక్సైజ్ శాఖమంత్రి కొత్తపల్లి జవహర్ పేర్కొన్నారు. ఎ కొండూరు మొయిన్ సెంటరులో ఎక్సైజ్‌శాఖ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం సర్పంచ్ బలుమూరి నాగపద్మ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్సైజ్ చట్టాని పటిష్టపరిచి కాపుసారా తయారీదారులపై ఉక్కుపాదం మొపుతానని హెచ్చరించారు. గ్రామాల్లో సారా తయారీని అపినవారి కోసం ప్రభుత్వ పరంగా ప్రత్యేక ఉపాధి అవకాశాలు కల్పించి వారి కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం జాతీయ రహదారి పక్కనే ఉన్న మద్యం షాపులను తొలగించి 500 మీటర్ల దూరంలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గ్రామాల్లో సారా నియంత్రణకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసి నవోదయం కార్యక్రమాన్ని కొనసాగిస్తామని, దీనిని ప్రజలు ఆచరించాలని కోరారు. గ్రామాల్లో బెల్టుషాపుల నియంత్రణకు చర్యలు తీసుకుని లైసెన్సు షాపుల సంఖ్యను పెంచి కల్తీమద్యం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని ఆయన పేర్కొన్నారు. మద్యాన్ని ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తనకు దృష్టికి వస్తే కేసులు నమోదు చేసి 5లక్షల జరిమాన విధిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్నారని చెప్పారు. సమాజానికి సేవ చేయాలన్న ఉద్దేశ్యంలో 660 మండలాల్లోని వెయ్యి కేంద్రాల్లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి జవహర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు అలవాల రమేష్‌రెడ్డి , ఎంపిపి వాసం మునీయ్య, టిడిపి జిల్లా కార్యవర్గసభ్యుడు గడ్డి కృష్ణారెడ్డి, ఉపసర్పంచ్ వనపర్ల డేవిడ్ రాజు, తహశీల్దార్ ఎం సురేష్‌కుమార్, రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరు కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.