మీకు తెలుసా ?

కన్ను సైజు ఎప్పటికీ మారదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి శరీరంలో అత్యంత క్లిష్టమైన నిర్మాణవ్యవస్థ ఉన్న భాగం మెదడు. ఆ తరువాత అలాంటి భాగం కన్ను. మెదడుకు, కంటికి లింక్‌గా ఉండే ‘ఆప్టిక్ నెర్వ్’ అతి సున్నితమైన, క్లిష్టమైన నిర్మాణంతో ఉంటుంది. దీనికి ఆపరేషన్ చేయడం ఇప్పటివరకు మనిషికి సాధ్యం కాలేదు. అందుకే ఐ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇప్పటికి సాధ్యం కావడం లేదు. ఇక మనిషి పుట్టినప్పడు ఎంత పరిమాణంలో కన్ను ఉంటుందో జీవితాంతం అదే సైజులో ఉంటుంది. అన్నట్లు పసికందులు ఏడ్చినప్పుడు కన్నీళ్లు రావు. కొన్ని నెలలు ఎదిగాక మాత్రమే వారి కళ్లు అశ్రువులను వదులుతాయి. పుట్టుకతో కంటిచూపులేనివారికి ‘కలలు’ కన్పించవు. పుట్టుకతో చూపు ఉండి ఆ తరువాత దృష్టికోల్పోయినవారు మాత్రం కలల్లో దృశ్యాలను చూడగలరు. మెదడులో సగభాగం కంటికోసమే పనిచేస్తుంది. మన జ్ఞాపకాల్లో 80శాతం మన కళ్లు చూసినవేనని తెలుసా. అన్నట్లు మన కళ్లల్లో మెదడునుంచి వచ్చే ‘ఆప్టిక్‌నెర్వ్’ కలిసేచోట ‘బ్లైండ్‌స్పాట్’ ఉంటుంది. కానీ ఒకకంటిలో లోపాన్ని మరోకంటిలోని చూపుతో మెదడు ఆ ‘అంధత్వ’ సమస్యను బయటపడనివ్వదు. ఎదుటి మనిషి కళ్లల్లో కన్పించే ‘క్లూ’ (్భవాల్ని) చదవగలిగే నేర్పు సాటి మనుషులకు, కుక్కలకు మాత్రమే ఉంది తెలుసా.

ఈ పక్షులంటే ఏనుగులకు చిరాకు
ఖడ్గమృగాలు, నీటిఏనుగులు, జిరాఫీలు, లేళ్లు, దుప్పుల శరీరాలపై వాలి, వాటిపై ఉండే పరాన్నజీవులను ఏరి తినే ‘ఆక్స్‌పెకర్’ పక్షులంటే ఏనుగులకు పరమ చిరాకు. అవి తమపై వాలడానికి వస్తే ఏ మాత్రం అవకాశం ఇవ్వవు. దుప్పి జాతికి చెందిన కొన్ని జంతువుల, అడవిదున్నల వర్గానికి చెందిన కొన్నింటికికూడా వీటి పొడ గిట్టదు. నిజానికి ఈ పక్షుల్లో రెండు జాతులున్నాయి. ఎర్ర, పసుపుముక్కులతో ఇవి ఉంటాయి. ఆయా జంతువులపై ఉండే పేనులు, ఇతర పరాన్నజీవులను ఇవి ఏరుకుని, గుంజుకుని తింటాయి. వాటి మేనిపై చిన్నచిన్న గాయాలనూ చేస్తాయి. ఆ గాయాలపై కొన్నిరకాల పరాన్నజీవులు చేరేందుకే అలా చేస్తాయి. అలా చేరే వాటినీ తినేస్తాయి. నిజానికి ఈ పక్షులూ పరాన్నజీవులే. ఆయా జంతువుల చెవుల్లో ఉండే గులిమినికూడా ఈ పక్షులు తింటాయి. అందులో ఉండే బ్యాక్టీరియా వీటి జీర్ణక్రియకు తోడ్పడుతుందని అంటారు. వీటిని రైనో, హిప్పోపోటమస్, జిరాఫి, కొన్నిరకాల లేళ్లు భరిస్తాయి. శత్రువుల రాకను పసిగట్టి ఈ పక్షులు హెచ్చరించడం వాటికి లాభం. పైగా శరీరంపై ఉండే పరాన్నజీవులనుంచి రక్షణా ఉంటుంది. ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఇదేగా. సహారా ప్రాంతంలో ఇవి కన్పిస్తాయి.

నిప్పుకోడి కన్ను మెదడుకన్నా పెద్దది
భూమిమీద నడిచే అతిపెద్ద కళ్లున్న జీవి ఆస్ట్రిచ్. దీని ఒక్కో కన్ను బ్రిలియర్డ్స్ బంతి అంత ఉంటుంది. దాదాపు ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఇది ఉంటుంది. దీని మెదడుకన్నా కన్ను సైజు పెద్దగా ఉంటుంది. దీని పుర్రెలో మెదడుకన్నా ఈ రెండు కళ్లు ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి.