ఆటాపోటీ

ఫిక్సింగ్ రిఫరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* జర్మనీకి చెందిన రాబర్ట్ హోజర్‌ను ఫిక్సింగ్ రిఫరీగా పేర్కోవాలి. తాను రిఫరీగా ఉన్న దాదాపు అన్ని మ్యాచ్‌లను అతను ఫిక్స్ చేశాడు. 2005లో జర్మనీ అధికారులు అరెస్టు చేసి, విచారణ చేపట్టగా అతను చెప్పిన వివరాలు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేశాయి. జర్మనీలో బుక్‌మేకర్ల నుంచి క్రొయేషియాలోని అండర్ వరల్డ్ మాఫియా వరకూ చాలా మందితో తనకు సంబంధాలున్నాయని హోజర్ అంగీకరించాడు. ‘బండెస్లిగా స్కాండల్’గా ప్రసిద్ధి చెందిన ఈ కుంభకోణంలో తనకు సహకరించిన పలువురు రిఫరీలు, ఆటగాళ్ల పేర్లను వెల్లడించాడు. నేరానికి పాల్పడిన హోజర్‌కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. జర్మనీ ఫుట్‌బాల్ సంఘం అతనిపై జీవితకాల సస్పెన్షన్ వేటు వేసింది. అతను చెప్పిన భారీ జాబితాలో ఎంత మందిపై చర్య తీసుకున్నారనే విషయాన్ని జర్మనీ గోప్యంగా ఉంచింది. చర్యలు తీసుకుంటూపోతే జర్మనీలో ఫుట్‌బాల్ ఆటగాళ్లుగానీ, రిఫరీలుగానీ, అధికారులుగానీ ఉండరని భయపడిందేమో!

అందరూ దొంగలే!
* దక్షిణాఫ్రికా ఫుట్‌బాల్‌లో ఒకరుకాదు.. ఇద్దరుకాదు.. ఏకంగా 30 మంది మ్యాచ్ ఫిక్సింగ్ దోషులుగా తేలారు. వివిధ క్లబ్‌ల అధికారులు, రిఫరీలు, మ్యాచ్ కమిషనర్లతోపాటు స్థానిక ఫుట్‌బాల్ సంఘాల ప్రతినిధులకు సైతం ఈ కుంభకోణంలో పాత్ర ఉందని నిర్ధారించిన దక్షిణాఫ్రికా ఫుట్‌బాల్ సంఘం 2004లో దోషులపై వేటు వేసింది. దోషుల్లో అధిక శాతం మంది ఈ సంఘానికి చెందిన వారే. దశాబ్దాల తరబడి నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు దక్షిణాఫ్రికా ఫుట్‌బాల్ సంఘం పరువు పోగొట్టుకుంది.

స్వచ్ఛందంగా..
* సిన్సినాటి రెడ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన పీటర్ రోజ్ కెరీర్ ముగిసిన తర్వాత అదే జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా పేరు సంపాదించుకున్న అతను తన ఆత్మకథ ‘ప్రిజన్ వితౌట్ బార్స్’ (కటకటాల్లేని జైలు)లో తాను ఏ విధంగా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిందీ వివరించి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేశాడు. 1980 దశకంలో తాను బుకీలతో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేశానని తన పుస్తకంలో పేర్కొన్నాడు. స్వచ్ఛందంగా నేరాన్ని అంగీకరించిన అతను తనపై తానే జీవితకాల సస్పెన్షన్‌ను విధించుకున్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్‌లకు సంబంధించి పీటర్ రోజ్ వెల్లడించిన ఏ ఒక్క అంశం కూడా రుజువుకాలేదని పేర్కొంటూ అమెరికా బేస్‌బాల్ సమాఖ్య క్లీన్‌చిట్ ఇచ్చినప్పటికీ అతను పట్టించుకోలేదు. తాను నేరం చేశానంటూ అజ్ఞాతవాసం గడుపుతున్నాడు.

- సత్య