ఫోకస్

ప్రభుత్వాల వైఖరే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోర్టులలో కేసులు కుప్పలు, తెప్పలుగా పేరుకుపోవడానికి పరోక్షంగా, ప్రత్యేక్షంగా ప్రభుత్వాలే కారణం. కోర్టులలో కేసులు పెరగడానికి కారణం సరిపడినన్ని కోర్టులు, న్యాయమూర్తులు లేకపోవడమే. కోర్టులు, న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని హైకోర్టులు, సుప్రీంకోర్టు, లా కమిషన్ కోరుతున్నా ప్రభుత్వాలు మిన్నకుండిపోతున్నాయి. కోర్టులలో పెండింగ్‌లలో ఉన్న వాటిలో 60 నుంచి 70 శాతం కేసులు ప్రభుత్వం ప్రతివాదులుగా ఉన్నవే. కోర్టుల సంఖ్య పెంచడంవల్ల న్యాయవ్యవస్థ బలపడుతుందని, తద్వారా శాసన వ్యవస్థ ప్రాధాన్యత తగ్గుతుందని పాలకులు భావన. కోర్టులలో కేసులు పెండింగ్‌లో ఉండటానికి ప్రభుత్వాలే కారణం. ఉదాహరణకు ఒక ఉద్యోగికి పదివేల రూపాయాలు చెల్లించాలని కిందిస్థాయి కోర్టు తీర్పు చెబుతుంది. దీనిని ప్రభుత్వం చిన్నతనంగా భావించి ఇదే కేసుపై లక్ష రూపాయాల వరకు ఖర్చు చేసి హైకోర్టును ఆశ్రయిస్తుంది. అక్కడకూడా ప్రభుత్వానికి చుక్కేదురయితే ఇదే కేసుపై సుప్రీంకోర్టుకు అప్పిల్‌కు వెళ్తుంది. అక్కడ ఈ కేసుపై 10 లక్షలు ఖర్చు పెట్టడానికి చేయడానికి కూడా ప్రభుత్వాలు వెనుకాడవు. అసలు కేసు పదివేల రూపాయాలు చెల్లిస్తే పోయేదానికి పది లక్షల వరకు ఖర్చు చేయడానికి కూడా ప్రభుత్వం పూనుకుంటుంది. ప్రభుత్వాలు ప్రతివాదులుగా ఉండే వాటిలో ఇలాంటి కేసులు 80 నుంచి 90 శాతం వరకు ఉంటాయి. కిందిస్థాయి కోర్టులు ఇచ్చే తీర్పులను సవాల్‌గా తీసుకుని పైకోర్టులను ఆశ్రయించే ప్రభుత్వాలు అదే 10 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయితే వాటిపై ఏ కోర్టు తీర్పు ఇచ్చినా తూ.చ తప్పకుండా అమలు చేస్తాయి. కోర్టులలో చాలామటుకు పెండింగ్‌లో ఉన్న కేసులు ఇలాంటివే. పై కోర్టులకు ఎలాంటి అంశాలలో వెళ్లాలనే దానిపై ప్రభుత్వాలకు ఒక స్పష్టమైన వైఖరి ఉండాలి, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా వ్యవహరించాలన్న దృక్పథం ఉన్నప్పుడే కేసుల సంఖ్య తగ్గుతుంది.

- జస్టిస్ చంద్రకుమార్ రిటైర్టు హైకోర్టు న్యాయమూర్తి