ఫోకస్

న్యాయ వ్యవస్థపై రాజకీయాలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యాయ వ్యవస్థలో రాజకీయ నాయకులు తలదూర్చరాదు.

రాజకీయాలతోనే న్యాయ వ్యవస్థ కలుషితమవుతోంది.

పెండింగ్ కేసుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యానికి

కూడా రాజకీయాలే కారణం. కోర్టుల్లో న్యాయమూర్తుల

పోస్టులు భర్తీ కానందువల్లే కేసుల పరిష్కారంలో దిగువ

కోర్టులు, హైకోర్టు, సుప్రీం కోర్టులపై తీవ్రమైన ఒత్తిడి

పెరుగుతోంది. సుమారు ఐదు వందల న్యాయమూర్తుల

పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవి భర్తీచేస్తే కొంతమేరకు

కోర్టులపై ఒత్తిడి తగ్గుతుంది. న్యాయ స్థానాల్లో కేసులు

పెరిగిపోతున్నందునే న్యాయమూర్తులు నాణ్యమైన

తీర్పులను వెలువరించలేకపోతున్నారు. సామాన్యుడు

కోర్టులను ఆశ్రయించి సత్వర న్యాయం

పొందలేకపోతున్నాడు. సుప్రీం కోర్టు కొలీజియంతో కేంద్రం

అవలంభిస్తున్న ఘర్షణాత్మకమైన వైఖరివల్ల

న్యాయమూర్తుల నియామకంలో తీవ్రమైన జాప్యం

జరుగుతోంది. కొలీజియం వ్యవస్థను దేశానికి స్వాతంత్రం

వచ్చినప్పుడే ఏర్పాటు చేశారు. ఇటీవల కేంద్రం కొలిజీయం

సిఫార్సు చేసిన కొంతమంది న్యాయమూర్తుల జాబితాను

తిప్పిపంపింది. లోతుగా ఆలోచిస్తే కేంద్రంలో అధికారంలో

ఉండేది ఒక రాజకీయ పార్టీ. తమకు కావాల్సిన వారి పేర్లు

కొలీజియంలో లేకపోతే ఆమోదించడంలేదనే ఆరోపణలు

ఉన్నాయి. న్యాయ వ్యవస్థకు మచ్చతెచ్చే విధంగా

అధికారంలో ఉన్న కొన్ని రాజకీయ పార్టీల వ్యవహరశైలి

తయారైంది. రాజ్యాంగంలోనే శాసన, కార్యనిర్వాహక,

న్యాయ వ్యవస్థకు మధ్య ఘర్షణ తలెత్తకుండా సున్నితమైన

విభజన రేఖ ఉంది. దీనివల్లనే ప్రజాస్వామ్యం చక్కగా

వర్థిల్లుతుంది. కాని దుర్బుద్ధి ఉన్న రాజకీయ పార్టీలవల్ల,

న్యాయ వ్యవస్థలో మితిమీరిన జోక్యంవల్ల ప్రజాస్వామ్యానికి

హాని కలుగుతోంది. పెండింగ్ కేసుల పరిష్కారానికి

న్యాయమూర్తుల ఖాళీలను వెంటనే భర్తీ చేయడం

అనివార్యం. అప్పుడే సామాన్యుడికి న్యాయం జరుగుతుంది.

న్యాయాధికారులు, న్యాయమూర్తులపై భారం పడదు.

న్యాయమూర్తుల పోస్టుల భర్తీని జాప్యం చేస్తూ, న్యాయ

వ్యవస్థను బలహీనపరచడం తగదు. న్యాయ వ్యవస్థలో

రాజకీయాల జోక్యాన్ని నివారించాలి.

-పాండురంగారావు లోక్‌సత్తా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు