ఫోకస్

ప్రభుత్వ అజమాయషీ ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన సంస్కరణల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ విద్యావిధానంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించడం కొంతవరకు మంచిదే. ప్రైవేటీకరణ విద్యావిధానం వల్ల ప్రభుత్వ విద్యాసంస్థల్లోనూ పోటీ పెరుగుతుంది. డీమ్డ్ విశ్వవిద్యాలయాల మాదిరిగా పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి సర్వహక్కులు ఉంటూ, ప్రైవేట్ విద్యారంగాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ముఖ్యం. ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్చంధంగా ముందుకొచ్చి, ధనాపేక్ష లేకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు నడుచుకుంటూ అన్ని వర్గాలకు విద్యను అందిస్తూ విద్యారంగ అభివృద్ధే ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తే ప్రైవేటీకరణ కూడా మంచిదే. మారుతున్న కాలానికి అనుగుణంగా విజ్ఞానపరంగా, పరిశోధనపరంగా ప్రైవేట్ విద్యాసంస్థలతో కొంతమేరకు ప్రభుత్వ విద్యాసంస్థలు వెనుకబడివున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ట్రిఫుల్ ఐటి లాంటి సంస్థలు ప్రైవేట్ విద్యాసంస్థలకు ధీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నాయి. ప్రభుత్వ జాతీయ విద్యాసంస్థలన్నీ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తున్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ అజమాయిషీలో పనిచేస్తే ప్రభుత్వ లక్ష్యం పూర్తిగా నెరవేరుతుంది అనడంలో సందేహం లేదు.

- ప్రొఫెసర్ విశ్వనాధరెడ్డి ఒంగోలు ట్రిపుల్ ఐటి డైరెక్టర్