ఫోకస్

పేదలపై గొడ్డలిపెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభివృద్ధి నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం విద్యలో ప్రైవేటీకరణ భాగస్వామ్యం చేయడం లక్ష్యం మంచిదైనా, ఆశించిన సత్పలితాలు లభించవు. 1950లో భారత రాజ్యాంగంలో అన్ని రంగాల అభివృద్ధితోపాటు విద్యాభివృద్ధి నిమిత్తం- ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు నిర్దేశించి తయారుచేసిన సంస్కరణలు ఇప్పుడిప్పుడే అమలులోకి వస్తున్నాయి. ఆ సంస్కరణలను అమలుచేస్తూ ప్రభుత్వం జాతీయస్థాయి విశ్వవిద్యాలయాలను ప్రతిష్ఠాత్మకంగా స్థాపించి, వాటిని బలోపేతం చేస్తే విద్య అందరికీ అందుబాటులో వుంటుంది. మట్టిలోకూడా మాణిక్యాలు వెలుగు చూడగలుగుతాయి. భారతదేశం ప్రజాస్వామిక దేశం. ప్రైవేట్ భాగస్వామ్యం వల్ల ఆధిపత్యం పెత్తందారుల చేతిల్లోకి పోతుంది. విద్య, ఉద్యోగాలు, వ్యాపార రంగల్లోనివారు ప్రభుత్వానికి విధేయులుగా పనిచేయకుండా ప్రభుత్వంపైనే అజమాయిషి చెలాయిస్తారని చూస్తారు. అక్కడ విద్యను అభ్యసించేవారు కూడా అదేకోవకు చెందుతారు. పెట్టుబడి పెట్టి చదువుకున్నవారు దేశాన్ని ఏ విధంగా ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తారో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రైవేటీకరణలో ఒప్పందాలు ఒక విధంగా, అమలు మరో విధంగా ఉంటూ పెద్దచదువులు పెద్దలకే దక్కుతాయి. పేదలకు ఏమాత్రం అందుబాటులో ఉండవు. రాష్ట్ర విభజన అనంతరం ఆర్థికంగా అభివృద్ధిపరంగా అనేక చిక్కులు ఏర్పడ్డాయి. విద్యను ప్రైవేటీకరణ చేయడం వల్ల రాష్ట్రం శరవేగంతో అభివృద్ధి జరిగినా ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరకుండా పేదలకు చదవులు అందని ద్రాక్షలా మారుతాయి. సాంకేతికంగా, వైద్యపరంగా, వృత్తి విద్యా కోర్సులపరంగా విశ్వవిద్యాలయాల పరంగా, జాతీయ స్థాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అనేక విద్యాసంస్థలు ఉన్నాయి. వాటిని ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహిస్తే పేదలందరికీ ప్రయోజనం చేకూరుతుంది.

-ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి కడప జిల్లా పులివెందుల ఇడుపులపాయ ట్రిపుల్ ఐటి