ఫోకస్

అందరికీ ఉన్నత విద్య సాకారమవుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రంలో ఏ ఏడాదికాయేడాది ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తొంది. అందరు ఉన్నత విద్యను అభ్యసించాలంటే అందుకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు అందుబాటులో ఉండాలి. నేడు వెనుకబడిన ప్రాంతాల నుంచి కూడా ఉన్నత విద్యాభ్యాసానికి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. అదే మన రాష్ట్రంలో ఆయా కోర్సులను అందుబాటులోకి తీసుకురాగలిగితే ఇతర రాష్ట్రాలకు విద్యార్థులు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. అందువల్లనే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లు ఆమోదానికి ద్వారాలు తెరచింది. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు నెలకోల్పడం వల్ల వివిధ విశ్వవిద్యాలయాల మధ్య పోటీతత్వం పెరిగి నాణ్యమైన విద్యను అందించడానికి అవకాశం ఉంటుంది. దేశంలో దిల్లీ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు అనేకం ఉన్నాయి. అంతేగాకుండా కర్ణాటకలో విద్యాభ్యాసం చేస్తున్న వారిలో అత్యధికంగా మన రాష్ట్రం నుంచే విద్యార్థులు ఉన్నారని ఒక అధ్యయనంలో తేలింది. ఇతర రాష్ట్రాల్లో విద్యను అభ్యసించాలంటే తడిసిమోపెడవుతుంది. చాలా ఖర్చుతో కూడుకున్నది. అదే మన రాష్ట్రంలో అందుబాటులో ఉంటే ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు పరుగులు తీయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడి విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో విద్యను అభ్యసించడం వల్ల ఇక్కడి మన సంపద ఆయా రాష్ట్రాలకు తరలిపోతుంది. దీనికి కూడా అడ్డుకట్టవేసే అవకాశం ఉంది. 1998లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలోనే జెఎన్‌టియు విశ్వవిద్యాలయాన్ని నెలకోల్పిన విషయం విధితమే. దీనిని నెలకోల్పడం ద్వారా పేదలు ఎంతో మంది ఉన్నత విద్యను అభ్యసించడానికి వీలు కలిగింది. రానున్న కాలంలో కూడా ప్రైవేటు విశ్వవిద్యాలయాల రాకతో పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నతమైన ఉపాధి అవకాశాలు పొందడానికి ప్రైవేటు విశ్వవిద్యాలయాలు దోహదపడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

- డాక్టర్ వి.శ్రీనివాసులు, ప్రిన్సిపాల్, జెఎన్‌టియు కళాశాల, విజయనగరం