ఫోకస్

పోటీతత్వం ఉంటేనే నైపుణ్యంలో అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక విద్యావిధానంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో ప్రైవేటురంగంలో విశ్వవిద్యాలయాల ఏర్పాటు అనివార్యం. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పలురంగాల్లో అభివృద్ధి, సేవలు మెరుగు పర్చాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ క్రమంలో ఉన్నత విద్యాభివృద్ధిలో భాగంగా ప్రైవేటు యాజమాన్యంలో యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీలు రావడం ఆహ్వానించదగిందే. ప్రైవేటురంగంలో యూనివర్సిటీల ఏర్పాటుతో విద్యావకాశాలు మెండుగా ఉంటాయి. విద్యారంగంలో పోటీతత్వం పెరుగుతుంది. తద్వారా ప్రభుత్వ నిర్వహణలోని యూనివర్సీటీల కన్నా మెరుగైన ఫలితాలు చూపాలన్న లక్ష్యంతో తమ మనుగడకోసం సుశిక్షితులైన ఆచార్యులను నియమించుకునేందుకు వీలుంది. ప్రభుత్వపరంగా అనుమతి పొందిన అనేక కాలేజీల్లో పేదపిల్లలకు ప్రభుత్వ ఆర్థిక సాయంతో చదువుకునే వెసులుబాటు కలుగుతుంది. ప్రైవేటు వర్సిటీల్లో ఫీజులు కూడా అధికంగా వసూలు చేసే అవకాశం లేకపోలేదు. దీంతో వారి ఆదాయ వనరులు పెరుగుతాయి. అదే సమయంలో పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఆర్థికభారం తప్పదు. మరోవైపు రిజర్వేషన్లు, మెరిట్ ప్రాతిపదికన సీట్లు పొందేందుకు ఆస్కారం ఉంది. ఈ పరిస్థితుల్లో విద్యారంగంలో పోటీని తట్టుకునేందుకు ప్రైవేటు రంగంలోని వర్సిటీల పరిధిలోని కాలేజీల్లో వౌళిక సౌకర్యాలు మెరుగుపడే అవకాశం ఉంది. లేకుంటే అనుబంధ కాలేజీలు ప్రభుత్వ నిబంధనల మేరకు మూతపడక తప్పదు. ఏతావాతా విద్యార్థులకు ప్రయోజనాలు కలిగించడమే ప్రధాన లక్ష్యంగా మారుతుంది. ప్రభుత్వ రంగంలోని వర్సిటీలకు గ్రాంట్లతోపాటు దేశవిదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉంటే అలునీ (పూర్వ విద్యార్థులు) సహాయ సహకారాలు కూడా మెండుగా ఉంటాయి కనుక ఆర్థికపరమైన ఇబ్బందులు అంతగా తలెత్తే అవకాశం లేదు. ప్రభుత్వపరంగా మెరుగైన ఉన్నతవిద్యను అందించేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈ క్రమంలో ప్రైవేటువర్సిటీలకు దీటుగా విద్యాభివృద్ధికి బోధనా సిబ్బంది నిరంతరం నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఐఐటిలు, ఎన్‌ఐటీల్లో ప్రభుత్వ, ప్రైవేటురంగంలోని విద్యార్థులు చదివే అవకాశాలు మెరుగుపడతాయి. ప్లేస్‌మెంట్స్‌కోసం పరస్పర సహకారం తీసుకోవచ్చు. అలాగే వివిధ విభాగాల్లో విద్యార్థులకు కెరీర్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్‌ను ఉమ్మడిగా నిర్వహించుకునే వీలు కలుగుతుంది. మరోవైపు ప్రభుత్వ వర్సిటీల్లో ఎంటెక్, పిహెచ్‌డీలు చేసే విద్యార్థులకు అర్హులైన సుశిక్షితులైన అధ్యాపకులు ఉంటారు. అధిక సంఖ్యలో ప్రభుత్వ పరంగానే ఉద్యోగాలు పొందాలనే ఆశ పడుతుంటారు. ఇదే సమయంలో ప్రభుత్వ వర్సిటీలు ఆర్థికభారాన్ని తట్టుకోవడానికి సెల్ఫ్ జనరేషన్, సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సులపై ఆధార పడాల్సి ఉంది. ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకున్న విద్యార్థులు ఆర్థిక భారాన్ని కూడా మోయక తప్పదు.

ప్రొఫెసర్ మహమ్మద్ ఎంఎం సర్కార్ ఉప కులపతి, జెఎన్‌టియూ, అనంతపురం