ఫోకస్

నేటి విద్యా వ్యవస్థలో ప్రైవేటు అనివార్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రైవేటు యూనివర్సిటీలు అనివార్యం. మనం కావాలన్నా, వద్దన్నా ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏదో ఒక రూపంలో వస్తాయి. దేశంలో 25 రాష్ట్రాలు ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇచ్చాయి. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇస్తున్నారు. 30 ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇచ్చారు. డీమ్డ్ యూనివర్సిటీ అని, ప్రైవేటు యూనివర్సిటీ అని ఏదో ఒక పేరుతో ప్రైవేటు యూనివర్సిటీలు పని చేస్తూనే ఉన్నాయి. మన రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇవ్వడం, విధివిధానాల రూపకల్పనకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావురావు మంత్రివర్గ ఉపసంఘం వేశారు. విద్యార్థులకు, రాష్ట్రానికి మేలు జరిగే విధంగా విధి విధానాలు రూపకల్పన చేసేందుకు ఈ సబ్ కమిటీ కసరత్తు సాగిస్తోంది. మనం ఇంకా ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇవ్వకపోయినా ఏదో ఒక పేరుతో అవి పని చేస్తున్నాయి. ఐఎస్‌బిని మన రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. ఇది విశ్వవిద్యాలయంలానే పని చేస్తుంది. ఇక్‌ఫాయ్ ఇదే తరహాలో ఉంది. డిమ్డ్ యూనివర్సిటీ పేరుతో చాలా విద్యా సంస్థలు విశ్వవిద్యాలయంగానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఐఎస్‌బి, గీతం, ఇక్‌ఫాయ్ మన రాష్ట్రంలో ఎప్పటినుంచో ఉన్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఎప్పటిలానే పని చేస్తాయి. ఇవి కొనసాగుతూనే కొత్త విశ్వవిద్యాలయాలు ప్రైవేటు రంగంలో వస్తాయి. గతంలో పెద్దసంఖ్యలో తెలంగాణ రాష్ట్రం నుంచి కర్నాటకకు ఇంజనీరింగ్‌కోసం వెళ్లేవాళ్లు. ఇతర దేశాలకు చదువుకోవడానికి పెద్దసంఖ్యలో వెళుతున్నారు. మనం ప్రైవేటు విశ్వవిద్యాలయాలు వద్దు అన్నంత మాత్రాన ఆగరు. వెళ్లేవారు వెళుతూనే ఉంటారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇవ్వడంద్వారా అవే మన రాష్ట్రానికి వస్తాయి. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు అనివార్యం అనే విషయాన్ని గ్రహించే అనుమతి ఇస్తున్నారు.

- పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ