ఫోకస్

అభివృద్ధి మాటున అవినీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి మాటున అవినీతి విచ్చలవిడిగా సాగుతోంది. మూడేళ్ల రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన వలన పేదలకు ఒనగూరిందంటూ ఏమీ లేదు. సంక్షేమ పథకాలు పేదలకు అందచేయడంలేదు. రాజధాని భూములను సింగపూర్ కన్సార్టియానికి అప్పగించడంలో ప్రభుత్వ అవినీతి స్పష్టమవుతోంది. ఈ అంశంలో రూ.25వేల కోట్ల మేర అవినీతి జరిగినట్లు కనిపిస్తుంది. న్యాయస్థానాలు అక్షింతలు వేసినా ప్రభుత్వ ధోరణిలో మార్పు ఉండడం లేదు. నిరుపయోగమైన పట్టిసీమ ప్రాజెక్ట్‌లో కోట్ల మేర అవినీతి జరిగింది. ‘పోలవరం’ను జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించి ప్రతి రూపాయి ఇచ్చేందుకు కేంద్రం ముందుకు వస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాన్ని తన చేతిలోకి తీసుకొని ఇబ్బడిముబ్బడిగా ధరలు పెంచేసి ప్రభుత్వ ధనాన్ని గుత్తేదారుల చేతిలో పెట్టడంద్వారా టిడిపి నేతలు తమ లాభం చూసుకుంటున్నారు. విశాఖపట్నం భూకుంభకోణం, అగ్రిగోల్డ్ ఆస్తుల జప్తులోనూ టిడిపి నేతలు కోట్లు దోచుకున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని, సంస్థ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తొలుత బాధితులకు అందాల్సిన పరిహారం ప్రభుత్వమే ఇవ్వాలని తాము ప్రతిపక్షంగా సూచిస్తుంటే ప్రభుత్వం మాత్రం సంస్థ ఆస్తులను టిడిపి నేతలు దారాధత్తం చేసుకునేందుకు సహకరిస్తోంది. ఇక అభివృద్ధి, సంక్షేమ విషయాలకొస్తే.. రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చి బేషరతుగా రుణమాఫీ చేయకుండా రైతాంగాన్ని, డ్వాక్రా మహిళలన్ని, చేనేత కార్మికుల్ని ఈ ప్రభుత్వం ఎంతో మోసం చేసింది. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని ఎపుడో మర్చిపోయారు. నిరుద్యోగుల భృతి గురించి మూడేళ్లపాటు పట్టించుకోకుండా ఇపుడు కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. ఈ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యం కూడా పడకెక్కింది. నిధుల చెల్లింపులో జాప్యం వలన రోగుల్ని చేర్చుకునేందుకు ప్రయివేటు ఆసుపత్రులు వెనకడుగు వేస్తున్నాయి. జివో 29 పేరుతో పాఠశాలలను క్రమబద్ధీకరించేందుకు నిర్ణయం తీసుకొని విద్యా వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తున్నారు. ఈ మూడేళ్లలో టిడిపి ప్రభుత్వం కనిపించని అభివృద్ధి మాటున కనిపించే రీతిలో అవినీతికి పాల్పడడమొక్కటే జరిగిందనేది వాస్తవం.

- కాకాణి గోవర్థన్‌రెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యే, నెల్లూరు జిల్లా వైసిపి అధ్యక్షుడు