హైదరాబాద్

శివోహం.. శివాలయాల్లో భక్త జనసంథోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణలోని శైవక్షేత్రాలు భక్తులు చేసిన 3ఓం నమః శివాయ2 అన్న శివనామస్మరణతో మార్మోగాయి. దేవాలయాలకు వచ్చిన లక్షలాది మంది భక్తులతో ఆలయాలు కళకళలాడాయి. శివపురాణ పఠనం, భజనలతో చాలా ఆలయాల్లో ఆనందం తాండవించింది. అన్ని ఆలయాల్లోనూ మహాశివరాత్రి సందర్భంగా రాజగోపురాలు, గర్భగుళ్లకు ప్రత్యేక అలంకరణ చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని శివాలయాల్లో శివుడికి భక్తుల అభిషేకం చేశారు. అలాగే పార్వతీపరమేశ్వరుల వివాహం అన్ని ఆలయాల్లో జరిగింది.
రాజన్న సిర్సిల్లా జిల్లాలోని పవిత్రక్షేత్రమైన వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయం, పెద్దపల్లి జిల్లాలోని కాళేశ్వర-ముక్తేశ్వర ఆలయం, మేడ్చల్ జిల్లాలోని కీసర రామలింగేశ్వర ఆలయం, నాగర్‌కర్నూలు జిల్లాలోని ఉమా మహేశ్వర ఆలయాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెద్ద, చిన్న దేవాలయాలన్నీ భక్తులతో పోటేత్తాయి. వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దాదాపు రెండు లక్షల మంది భక్తులు సందర్శించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుండి కీసరకు లక్షలాది మంది భక్తులు వచ్చారు. శ్రీశైలం దేవస్థానానికి ఉత్తర ద్వారంగా పేరున్న ఉమామహేశ్వరం ఆలయం భక్తులతో కిటికిటలాడింది. నాగర్‌కర్నూలు జిల్లా లోని నల్లమల అటవీ ప్రాంతంలోని లింగాల మండలం భౌరాపురంలో మహాశివరాత్రి సందర్భంగా పురాతన ఆలయమైన భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం, చెంచుల పండగ ఘనంగా జరిగింది.
అన్ని ప్రధాన శివాలయాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా పట్టువస్త్రాలు పంపించింది. మహాశివరాత్రి అట్టహాసంగా పూర్తయింది.