AADIVAVRAM - Others

విహంగాలై విహరిస్తాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది మార్చి 10వ తేదీ ఆ ఇద్దరు మహిళల జీవితాల్లో నిజంగా మరపురానిది, మధురమైనది.. ఓ ‘గ్లైడర్’లో గగన వీధుల్లో విహరించి 80 రోజుల్లో 21 దేశాలను సందర్శించేందుకు వారు సాహసయాత్రకు సన్నద్ధం కావడం ఓ సంచలనం.. ఆ ఇద్దరూ తల్లీకూతుళ్లు కావడం మరో విశేషం..
కర్నాటకలోని మైసూరుకు చెందిన 42 ఏళ్ల కెప్టెన్ ఆద్రే దీపికా మబెన్, ఆమె కుమార్తె అమీ మెహతా వంటగది కంటే చిన్నదైన ‘మహి’ (సైనుస్-912) అనే మోటార్ గ్లైడర్‌లో విహరించేందుకు సంకల్పించారు. పురుషులకు దీటుగా ఏ రంగంలోనైనా మహిళలు సైతం అద్భుతాలు సృష్టిస్తారనడానికి ఈ తల్లీకూతుళ్లు నిదర్శనంగా నిలుస్తున్నారు. ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా, పైలట్‌గా అనుభవం ఉన్న దీపికా మబెన్ తన కుమార్తెను ఈ సాహసయాత్రలో భాగస్వామిని చేశారు. తక్కువ ఇంధనం ఖర్చుతో వివిధ దేశాలను చుట్టుముట్టి వచ్చేందుకు ‘సైనుస్0 912’ గ్లైడర్ ఎంతో అనువైనదని దీపిక చెబుతున్నారు. వీరు ప్రయాణించే ‘మహి’ గ్లైడర్ భూమికి అయిదు నుంచి ఏడువేల అడుగుల ఎత్తులో విహరిస్తుంది. వింగ్ కమాండర్ రాహుల్ మోంగా ప్రోత్సాహంతో తాము ఈ సాహస యాత్రకు సిద్ధమైనట్లు దీపిక, అమీ చెబుతున్నారు.
కొన్ని అవరోధాలు, అవస్థలు తప్పవని తెలిసినప్పటికీ తాము సాహసయాత్రకు సిద్ధమైనట్లు వారు తెలిపారు. ఎత్తయిన పర్వతాలు లేని మార్గంలో తాము గ్లైడర్‌లో ప్రయాణిస్తామన్నారు. ఇప్పటికే ‘మహి’ గ్లైడర్‌లో విహరించిన అనుభవం ఉన్నందున తమ యాత్రకు దానినే ఎన్నుకున్నామని అంటున్నారు. భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో గగన విహారం చేసిన అనుభవం తనకు ఉన్నందున సాహసయాత్రలో అంతగా అవరోధాలు ఉండవని దీపిక ధీమా వ్యక్తం చేస్తున్నారు. గ్లైడర్‌పై తనకు సాంకేతికపరంగా పూర్తి అవగాహన ఉందన్నారు. 21 దేశాలను 80 రోజుల్లో సందర్శించేందుకు వీరు తగిన ప్రణాళికను ఇప్పటికే రూపొందించుకున్నారు. తమ యాత్రకు అవసరమైన అనుమతులు, ఇతర డాక్యుమెంట్లను వీరు సిద్ధం చేసుకున్నారు. ఝార్ఖండ్‌లో శిక్షణ పొందిన దీపిక దేశంలోనే గ్లైడర్ లైసెన్స్ పొందిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. గ్లైడింగ్‌లో అన్ని అర్హతలు పొందిన దీపిక, అమీలకు ‘ఓరియంట్ ఫ్లయిట్ ఏవియేషన్ అకాడమీ’ ఆర్థికంగా అండదండలు అందిస్తోంది. తన కుమార్తెతో కలసి గగన విహారం చేసే క్షణాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు దీపిక భావోద్వేగంతో తెలిపారు.
ఫొటోగ్రఫీ కోర్సును అభ్యసిస్తున్న అమీ ఈ సాహస యాత్రను అందంగా చిత్రీకరించాలని సంకల్పించారు. బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, జపాన్, రష్యా, అమెరికా, కెనడా, గ్రీన్‌ల్యాండ్, ఐస్‌ల్యాండ్, యూకే, టర్కీ, ఇరాన్ దేశాల్లో 80 రోజుల పాటు వీరి సాహసయాత్ర సాగుతుంది. గగన విహారంలో మూడు విషయాలకు సంబంధించి ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని దీపిక గుర్తుచేస్తున్నారు. ‘ఎయిర్ క్రాఫ్ట్, పైలట్, వాతావరణం’ అనే మూడు అంశాలను నిరంతరం గుర్తుంచుకోవడం తప్పనిసరి అంటున్నారు. శిక్షకురాలిగా ఇన్నాళ్లూ ఎంతోమందికి అనేక అంశాలు నేర్పానని, వాటిని తన జీవితంలో ఆచరించాల్సిన సమయం ఇపుడు వచ్చిందని దీపిక తెలిపారు.