రాష్ట్రీయం

ఫిరాయింపులపై ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: పార్టీ వీడిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు అనర్హత పిటిషన్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఆయన శుక్రవారం పార్టీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో తాజా పరిణామాలపై చర్చించారు. ‘నేనున్నా, అధైర్యపడకండీ..’అంటూ ధైర్యం చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యేలతో ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. కష్టకాలంలోనే ధైర్యంగా ఉండాలని, బెదిరింపులకు లొంగరాదని ఆయన వారికి చెప్పినట్లు సమాచారం. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ మధుసూదనాచారికి ఫిర్యాదుచేయాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలో టిడిపి ఎమ్మెల్యేలు బయలుదేరి వెళ్లారు. అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో వారు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ ఎస్.రాజాసదారామ్‌కు వినతి పత్రం అందజేశారు. ఇలాఉండగా టిడిపి శాసనసభాపక్షం నాయకునిగా నియమితులైన ఎ.రేవంత్ రెడ్డి శుక్రవారం అసెంబ్లీ ఆవరణలోని టిడిఎల్‌పి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, సండ్ర వెంకట వీరయ్య, అరికెపూడి గాంధీలతో సమావేశమై చర్చించారు.