రాష్ట్రీయం

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైబరాబాద్‌: నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాతో ఓ మహిళను వేధిస్తున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను సైబరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులు అరెస్టు చేశారు. సైబర్‌క్రైం ఏసీపీ సతీష్‌కుమార్‌ కథనం ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా కోరుట్ల మండలం గుమ్లాపూర్‌ గ్రామానికి చెందిన బండ్ల హేమంత్‌కుమార్‌(24) కొంతకాలం కిందట నగరానికి వచ్చి కేబీహెచ్‌బీ కాలనీలో నివసిస్తూ ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అతడు పదో తరగతి(2008)లో సహ విద్యార్థినికి నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచి ఆమెకు లైంగిక వేధింపుల సందేశాలు పంపించాడు. దీనిపై బాధితురాలు బుధవారం సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌ దర్యాప్తు చేపట్టి చాటింగ్‌ చేసిన ఐపీ వివరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.