రాష్ట్రీయం

‘ఫ్యన్’ కాలిపోయింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైకాపాపై లోకేష్ చలోక్తులు
విశాఖపట్నం, డిసెంబర్ 7: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత పార్టీ కార్యకర్తలు చేపట్టాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత నిరంతర విద్యుత్ ఇస్తుండటంతో ‘ఫ్యన్’ కాలిపోయిందని వైకాపా ఎన్నికల గుర్తును ఉద్దేశించి చమత్కరించారు. జనచైతన్య యాత్రల పర్యటనలో భాగంగా ఆయన సోమవారం విశాఖ జిల్లాలోని పెందుర్తి, సబ్బవరం, చీడికాడ ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ మహానేతల తనయులమని చెప్పుకుంటూ మాయ మాటలు చెప్పే నేతలను నమ్మవద్దంటూ పరోక్షంగా జగన్‌పై చురకలు వేశారు. రాష్ట్రంలో నిరుద్యోగం ఉండకూడదన్న లక్ష్యంతోనే పరిశ్రమల స్థాపనకు విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి ఆదరణ ఎక్కువగా ఉందన్నారు.