ప్రకాశం

అట్టహాసంగా క్రిస్మస్ సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు , డిసెంబర్ 25 : క్రిస్మస్ సంబరాలను జిల్లాలోని క్రైస్తవ సోదరులు శుక్రవారం అట్టహాసంగా జరుపుకున్నారు. లోక రక్షకుడైన ఏసుక్రీస్తు లోకంలో అవతరించిన సంతోషాన్ని ఆనందోత్సాహాల మధ్య క్రైస్తవ సోదరులు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఒంగోలు నగరంలోని జూవెట్ మెమోరియల్ బాపిస్టు చర్చి, సెయింట్ ధెరిస్సా, ఎష్కోల్, టెంట్ పోస్టు, నజరేత్‌బాపిస్టు చర్చి, క్లౌ మెమోరియల్ బాపిస్టు చర్చి, ఆర్‌సిఎం చర్చీలతో పాటు నగరంలోని పలు చర్చీలకు విద్యుత్ దీపాలు అలంకరించి చర్చీల్లో పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో జిల్లాలోని వేలాదిమంది క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. చర్చీలతో పాటు తెలుగుదేశం, వైకాపా , బిజెపి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలతో పాటు వివిధ విద్యా సంస్థల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర రవాణా శాఖా మంత్రి శిద్దా రాఘవరావు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, జిల్లా శాసన మండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డితో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రిస్మస్ కేక్‌లను కట్ చేసి అందరికీ పంచి పెట్టి హ్యాపీ క్రిస్మస్ అంటూ క్రిస్మస్ శుభాకాంక్షలను తెలుపుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి
గుంటూరు ఎస్‌బిఐ రీజనల్ మేనేజర్‌తో పాటు మరో ఇద్దరికి గాయాలు
అద్దంకి/మేదరమెట్ల, డిసెంబర్ 25: అద్దంకి మండలం విప్పర్లపాలెం వద్ద మేదరమెట్ల, నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు ఎస్‌బిఐ రీజనల్ మేనేజరు రామమోహనరావు భార్య శ్రీదేవి(40) అక్కడికక్కడే మృతి చెందగా రామమోహనరావు, ఆయన తల్లి మరో చిన్నారి నవీన్‌కు తీవ్రగాయాలు కాగా వారిని వైద్యశాలకు తరలించారు. వివరాల ప్రకారం శింగరకొండ శ్రీప్రసన్నాంజనేయ స్వామివారిని దర్శించుకునేందుకు గుంటూరు నుండి వస్తుండగా విప్పర్లవారిపాలెం వద్ద రోడ్డుపక్కన ఆగి ఉన్న వీరి కారును వెనుక నుండి వస్తున్న మరో కారు ఢీకొంది. ఈ ఘటనలో రామమోహనరావు భార్య శ్రీదేవి కారులోనే మృతి చెందింది. శ్రీదేవి మృతదేహం కారులో ఇరుక్కుపోవడంతో ఆమెను కారునుండి బయటకు తీసేందుకు సుమారు మూడుగంటల పాటు కష్టపడ్డారు. గ్యాస్‌కట్టరు సహాయంతో డోరును తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. క్షతగాత్రులను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, ఉన్నత వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. మేదరమెట్ల ఎస్సై పాండు రంగారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.