రాష్ట్రీయం

కసాయి తండ్రి ఘాతుకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: జిల్లాలోని కట్టంగూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇస్మాయిల్‌పల్లికి చెందిన బండారు పరుశురాములు, పద్మ దంపతులకు తొలుత ఒక కుమార్తె జన్మించింది. తరువాత 2017 మార్చి 17న లాస్య జన్మించింది. రెండోసారి కూడా ఆడపిల్ల పుట్టడంతో తండ్రి ఆ చిన్నారిని అంతమొందించాలనుకున్నాడు. లాస్యకు జలుబు చేయగా.. మందుల షాపు నుంచి జలుబు మందు తీసుకుని వచ్చేటపుడు ఆ మందులో తండ్రి పురుగుల మందు కలిపాడు. తల్లికి ఏమీ తెలియదు కాబట్టి ఆమె బిడ్డకు మందు పోసింది. అస్వస్థతకు గురైన ఆ చిన్నారిని తొలుత ఆర్‌ఎంపీ వైద్యుని వద్దకు, తదనంతరం కామినేని ఆసుపత్రికి, నీలోఫర్‌కు తీసుకుని వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ లాస్య చనిపోయింది. లాస్య తాతకు అనుమానం వచ్చి జలుబు మందు నకిలీది అయి ఉండవచ్చని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు నిర్వహించగా.. జలుబు మందులో పురుగుమందు కలపటం వల్ల చనిపోయిందని పరీక్షల్లో వెల్లడైంది. కన్నతండ్రి కసాయితనం బయటపడింది.