జాతీయ వార్తలు

త్వరలోనే మరో 25 నేతాజీ రహస్య ఫైళ్లు వెల్లడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 11: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు చెందిన మరో 25 రహస్య ఫైళ్లను త్వరలోనే బహిర్గతం చేయనున్నట్టు కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి మహేశ్ శర్మ శుక్రవారం ప్రకటించారు.‘నేతాజీ ఫైళ్లలో ఏముందో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రజల్లో ఉంది. అందుకే రెండో విడతగా 25 రహస్య ఫైళ్లను పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే బహిర్గం చేయాలని నిర్ణయించాం’అని ఆయన తెలిపారు. నేషనల్ ఆర్కివ్స్ ఇండియా(ఎన్‌ఏఐ) 125వ వార్షికోత్సవానికి హాజరైన మంత్రి విలేఖరులతో ముచ్చటించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మే 13తో ముగియనున్నాయని మంత్రి అన్నారు. నేతాజీ రహస్య ఫైళ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని బోస్ 119 జయంతి నాడు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేసిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఇందులో భాగంగా వంద రహస్య ఫైళ్లను బహిర్గతం చేసినట్టు మంత్రి తెలిపారు. రహస్య ఫైళ్లను డిజిటలేజ్ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. నేతాజీ ఫైళ్లకు సంబంధించి వివరాలు ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు ఎన్‌ఏఐ డిప్యూటి డైరెక్టర్ సంజయ్ గర్గ్ వెల్లడించారు.