హైదరాబాద్

ఫైళ్ల క్లియరెన్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మరోసారి అధికార వికేంద్రీకరణ
* మెరుగైన సేవలందించటమే ప్రధాన లక్ష్యం
* సిసిపి, అదనపు కమిషనర్లకు అదనపు అధికారాలు
హైదరాబాద్, డిసెంబర్ 5: మహానగర పాలక సంస్థలో ఇక ఎక్కడా కూడా ఫైళ్లు పెండింగ్‌లో ఉండకుండా చర్యలు చేపట్టారు కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి. ఇదివరకు కూడా ఫైళ్లను పరిశీలించి, పరిష్కరించటంలో ఎంతో స్పీడు అధికారిగా పేరుగాంచిన జనార్దన్‌రెడ్డి తన వర్క్ ఆఫ్ స్టైల్‌ను జిహెచ్‌ఎంసి అధికారులకు అలవాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు గాను ఫైళ్లు ఎప్పటికపుడు క్లియర్ చేస్తేనే ప్రజలకు మెరుగైన సేవలందించే అవకాశముందని ఆయన భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు, అలాగే మెడికల్ రియంబర్స్‌మెంట్ చెల్లింపులకు సంబంధించిన ఫైళ్లను సకాలంలో పరిష్కరించేందుకు గాను అధికార వికేంద్రీకరణ చేశారు. కోర్టుల్లో అఫిడెవిట్లు సమర్పించే అధికారాలను చీఫ్ సిటీ ప్లానర్(సిసిపి), అదనపు కమిషనర్లకు పలు అధికారాలను బదాలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉద్యోగుల వైద్య చికిత్సలకు సంబంధించిన ఫైళ్లను జోనల్ కమిషనర్లు, అదనపు కమిషనర్ల స్థాయిలోనే పరిష్కరించాలని కమిషనర్ ఆదేశించారు. ప్రధానంగా మెడికల్ రియంబర్స్‌మెంట్ ఫైళ్లకు సంబంధించి లక్ష రూపాయాల్లోపు ఉన్న ఫైళ్లను స్క్రూటినీ చేసి, వాటిని ఆమోదించే అధికారాన్ని సంబంధిత జోనల్ అధికారులకు, కేంద్ర కార్యాలయంలో పరిశీలన విభాగం అదనపు కమిషనర్‌కు అధికారాలను అప్పగించారు. రక్ష రూపాయల కన్నా ఎక్కువ మెడికల్ రియంబర్స్‌మెంట్ ఉంటే మాత్రమే కమిషనర్ ఆమోదం అవసరమంటూ ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే పరిపాలన కారణాల వద్ద ఈ అధికారాలను తిరిగి ఉపసంహరించుకునే అవకాశం సైతం లేకపోలేదని కూడా కమిషనర్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
జిహెచ్‌ఎంసిపై 146 కోర్టు కంటెంట్ కేసులు
మహానగర పాలక సంస్థపై కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులతో పాటు జిహెచ్‌ఎంసిపై 146 కంటెంట్ కోర్టు కేసులున్నట్లు అధికారులు తెలిపారు. అయితే స్థల సేకరణ, టౌన్‌ప్లానింగ్ విభాగాలకు చెందిన కేసులకు సంబంధించి సంబంధిత విభాగాధిపతులు కోర్టులో అఫిడెవిట్ సమర్పించే అవకాశం కల్పించిన కమిషనర్ కంటెంట్ కేసులపై కూడా ఎక్కువగా దృష్టి సారించారు. మొత్తం 146 కేసులుండగా, వీటిలో సుమారు 134 కేసులు టౌన్‌ప్లానింగ్‌కు చెందినవిగా గుర్తించిన కమిషనర్, వీటిని త్వరగా పరిష్కరించేందుకు వీలుగా స్టాండింగ్ కౌన్సిళ్లకు ప్రత్యేక పర్యవేక్షక అధికారాలను ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కోర్టులో నడుస్తున్న కేసులకు సంబంధించి అదనపు కమిషనర్ సురేంద్రమోహన్‌ను పర్యవేక్షణాధికారిగా నియమిస్తున్నట్లు కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పేదల అభ్యున్నతే తెరాస ప్రభుత్వ లక్ష్యం
సికింద్రాబాద్, డిసెంబర్ 5: పేద ప్రజల సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావుగౌడ్ పేర్కొన్నారు. శనివారం సికింద్రాబాద్‌లోని తెరాస కార్యాలయానికి పెద్దయెత్తున తెరాస శ్రేణులు తరలివచ్చి మంత్రిని ఘనంగా సన్మానించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నగరంలో విద్యుత్, మంచినీటి బకాయిలను రద్దు చేయడం పట్ల వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేయడంతోపాటు మంత్రిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, వారి సంక్షేమం, అభివృద్ధి కోసమే సిఎం కెసిఆర్ నిరంతరం తపన పడుతున్నారని అన్నారు. ఖర్చుకోసం వెనుకాడకుండా పేదలకు జీవితాల్లో వెలుగులు నింపడానికి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. రెక్కాడితే డొక్కాడని బడుగు జీవులు బకాయిలు చెల్లించకలేక సతమతమవుతున్నారని తెలుసుకుని ఇబ్బందులను దూరం చేసిన సిఎం పేదల హృదయాల్లో నిలిచిపోయారని అన్నారు. గ్రేటర్‌లో దశాబ్దాల తరబడి పేరుకుపోయిన సమస్యలను దశలవారీగా దూరం చేస్తూ శాశ్వత పరిష్కారాలు చేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగా విద్యుత్ కోతలను నివారించడంతోపాటు, మంచినీటి సమస్య పరిష్కారానికి కృష్ణా, గోదావరి నీళ్లను తరలించారని అన్నారు. అదే విధంగా చెత్తకష్టాలను దూరం చేయడానికి ప్రత్యేక వాహనాలను సమకూర్చారని తెలిపారు.
పేదలకోసం ఎక్కడా లేనివిధంగా ఖర్చుకు వెనుకంజ వేయకుండా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించడానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు దేశంలోనే మోడల్‌గా మారిపోయయని తెలిపారు. ఇక సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎక్కడా ఎలాంటి సమస్యలు లేకుండా ప్రజలతో నిరంతరం మమేకమై పలు కార్యక్రమాలను చేపడుతున్నట్టు మంత్రి పద్మారావు చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసిన ఇతర పార్టీల నేతలు తెరాస నాయకత్వంపై నమ్మకంతో పార్టీలో చేరుతున్నారని మంత్రి పద్మారావు పేర్కొన్నారు. ప్రభుత్వంపై విశ్వాసంతో పార్టీపై నమ్మకంతో పార్టీలోకి చేరుతున్న వారిని ఆహ్వానించడం తప్పు ఎలా అవుతుందని అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దనున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గణేశ్ ముదిరాజ్, గీతాదయాకర్, ఎర్రశ్యామ్, ఎర్రనాగు పాల్గొన్నారు.

ఉగ్రవాదాన్ని అంతం చేయండి
హైదరాబాద్, డిసెంబర్ 5: ఇండియన్ అరబ్ ఫ్రెండ్‌షిప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం రవీంద్రభారతిలో జరిగిన ‘పాలస్తీనా సాలిడారిటి డే’లో ‘ఉగ్రవాదాన్ని అంతం చేయండి- మానవత్వాన్ని కాపాడండి’ అని పలువురు నేతలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, ఇజ్రాయిల్ చర్యలను ప్రపంచ దేశాలు ఖండించాల్సిన అవసరం వుందన్నారు. హింసతో ఏ సమస్యను పరిష్కరించలేమని హక్కుల సాధనకు ముస్లింలలో చిచ్చు రేపే పనులు జరుగుతున్నాయని అన్నారు. ఐఎస్‌ఐఎస్‌ను పెంచి పోషించింది అమెరికానే అన్నారు. శాంతికి ప్రతిరూపంగా వున్న ముస్లింలను అంతఃకలహాలతో వేరుచేయాలని కొంతమంది చూస్తున్నారని, వారితో అప్రమత్తంగా వుండాలని అలీ అన్నారు. రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, ఇటీవల ఫ్రాన్స్, అమెరికా దాడులను ప్రస్తావిస్తూ ప్రపంచానికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి వస్తుందేమోనని అన్నారు. హైదరాబాద్‌కు నిజాం కాలం నుంచి అనుబంధం వుందని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేది సంపన్నులేనని అన్నారు. క్రూరత్వాన్ని, రాక్షసత్వాన్ని ఖురాన్, ఇస్లామ్ కోరలేదన్నారు. ప్రస్తుతం జరిగే దాడులన్నీ ఇస్లామ్ వ్యతిరేక శక్తుల పనేనన్నారు. ఎక్కడైతే లౌకికవాదం వుంటుందో అక్కడ శాంతి సామరస్యం వుంటుందన్నారు. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ, ఇజ్రాయిల్ మారణహోమం సృష్టించి అమాయకులను బలితీసుకుంటుందని, ఈ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు వౌనంగా వుండటం దేనికి సంకేతమని ఆయన అనుమానం వ్యక్తం చేసారు. ప్రస్తుతం ఏ దేశమైతే తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుందో ఆ శక్తులే దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని అన్నారు. శాంతి కోసం మన దేశం సంఘీభావం తెలపడం సంతోషమన్నారు. కార్యక్రమంలో గోవర్ధన్‌రెడ్డి, వౌలాన అస్రావుల్‌హక్, ఫరూక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.