జాతీయ వార్తలు

ఇంకా దొరకని విమానం ఆచూకీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్-32 విమానం అదృశ్యమై మూడు రోజులు కావస్తున్నా ఇంకా ఆచూకీ దొరకలేదు. మూడో రోజు ఆదివారం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సముద్రంలో ప్రతికూల వాతావరణం ఉండటం గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. 18 నౌకలు, 8 విమానాలు, ఒక సబ్మెరైన్ సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఉపగ్రహాల సాయంతో శోధిస్తున్నారు. బంగాళాఖాతంలో విమాన ప్రమాదం జరిగిందని భావిస్తున్న ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉందని నేవీ అధికారులు చెప్పారు. మూడున్నర కిలో మీటర్ల మేర సముద్రంలోతు ఉండటంతో గాలించడానికి కష్టమవుతోందని తెలిపారు.