ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-100

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ చిత్రం ఏ సినిమా వర్కింగ్ స్టిల్?
2. గోరొంక గూటికే చేరావు చిలుకా.. ఈ పాటతో దాగుడుమూతలు ఆడిన రచయిత ఏవరు?
3. 1984లో వచ్చిన గూండా చిత్రంలో చిరంజీవి పేరు. ఓ దర్శకుడిని కలుపుకుంటే మరో హీరో గుర్తుకొస్తాడు?
4. తబుస్సుకు ఫాతిమా హష్మి -స్క్రీన్ నేమ్?
5. మరదలు పిల్ల ఎగిరిపడకు అన్న సినారె పాటను ట్యూన్ చేసిన సంగీత దర్శకుడు?
6. ఓటమిని పరిగెత్తించు. అది నిన్ను విజయం దాకా తీసుకెళ్తుంది? అంటూ స్ఫూర్తిదాయక డైలాగ్ రాసిందెవరు?
7. తెలిమంచు కురిసింది తలుపు తీయవా ప్రభూ! అంటూ ప్రకృతిని తట్టిలేపిన కుర్రాడెవరు?
8. ఎన్టీఆర్ సీతారామ కల్యాణం చిత్రానికి సంభాషణలు అందించిన గొప్ప రచయిత?
9. కళావాచస్పతిగా ప్రఖ్యాతిగాంచిన కొంగర జగ్గయ్య నటించిన ఒకే ఒక తమిళ చిత్రం?
10. పక్క ఫొటోలోని హీరోయిన్ ఎవరు?
*
సమాధానాలు- 98

1. చలో
2. కమల్‌హాసన్
3. దేవా
4. అప్పారావు
5. సూపర్
6. కరుణ
7. అభిరామ్
8. జమున
9. అనిశెట్టి సుబ్బారావు
10. తమన్నా
*
సరైన సమాధానాలు రాసిన వారు

జివి మురళీమోహన్, ముచ్చుమిల్లి
లతీఫొద్దీన్ అహమద్, సుల్తానాబాద్
బి చెంచురామయ్య, హైదరాబాద్
కరణం శివానందరావు, కర్నూలు
సంజీవిగారి శ్రీహరి, బెంగళూరు
ఎస్‌ఆర్ శ్రీవాత్సవ, బెంగళూరు
ఆర్‌విసిహెచ్‌ఎన్ రావు, శ్రీకాకుళం
సంజీవిగారి నాగశే్వత, బెంగళూరు
ఎంవి భాస్కరరెడ్డి, కుతుకులూరు
కాట శివభూషణం, కర్నూలు
తేనేటి రమ్యదీప్తి, సత్తెన్నపల్లి
సిహెచ్ రమాదేవి, హైదరాబాద్
వి శుభశ్రీ ప్రియాంక, విజయవాడ
జివి కృష్ణకుమారి, తుని
ఎన్‌బికె రాజేంద్ర, తుంగతుర్తి
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36,
సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్