ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-107

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానిది?
2. రెండు జళ్ల సీత చిత్రంలో శ్రీలక్ష్మి పాత్ర పేరు? హాట్ తెలుగు యాంకర్ పేరే..
3. జోలా జోలమ్మ జోలా జోలాలీ జోల -సూత్రధారులు కోసం పాట రాసిందెవరు?
4. నటుడు నాగభూషణం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే గొప్ప నాటకం?
5. తరుణ్, ఇలియానా జంటగా నటించిన విజయభాస్కర్ చిత్రం?
6. శోభన్‌బాబు ‘అందరూ దొంగలే’ చిత్రానికి నిర్మాత ఎవరు?
7. కృష్ణ ‘నెంబర్ వన్’ చిత్రానికి సంభాషణలు అందించినది ఎవరు?
8. ఎన్టీఆర్ ‘అడవిరాముడు’ చిత్రం ఏ కన్నడ హిట్టు చిత్రం ప్రభావంతో తీశారు?
9. శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న చిత్రంలో పద్మనాభానికి జోడీగా కనిపించిన నటి?
10. పక్క చిత్రంలోని హీరోయిన్ ఎవరు?

సమాధానాలు- 105

1. మున్నా
2. శ్రీదేవి
3. ఆచార్య ఆత్రేయ
4. యండమూరి వీరేంద్రనాథ్
5. రవికాంత్ నగాయిచ్
6. హరిహరన్
7. నీకోసం
8. విఠలాచార్య
9. విజయలక్ష్మి
10. గజాలా

సరైన సమాధానాలు రాసిన వారు

బీవీ కమల, మచిలీపట్నం
కె నాగసుశీల, తుని
డి. రాజేష్, శ్రీకాకుళం
ఎస్ కళ్యాణి, విజయవాడ
ఎన్ రాఘవరావు, పెంటపాడు
హెచ్ సుధీర్‌సాయ, పెద్దాపురం
కె శివానందరావు, కర్నూలు
జివి మురళీమోహన్, ముచ్చుమిల్లి
సిహెచ్‌ఎస్ మన్విత, హైదరాబాద్
కాసుల సోమేశ్, కర్నూలు
ఎస్‌ఆర్ శ్రీవాత్సవ, బెంగళూరు
లక్ష్మీశశాంక, బాగ్‌అంబర్‌పేట
ఎస్.శ్రీహరి, బెంగళూరు
తేనేటి రమ్యదీప్తి, సత్తెన్నపల్లి
ఎల్ నాగ, బిక్కవోలు

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36,
సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్