ఫోకస్

ద్వంద్వ వైఖరే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్‌లో భాగమైన కాశ్మీర్‌లో కల్లోలం సృష్టించడం ద్వారా తామే ముస్లిం మతానికి పెద్దగా పాకిస్థాన్ ప్రపంచానికి చెబుతోంది. అయితే దక్షిణ చైనాలోని ఉయ్‌గుర్ ప్రాంతంలోను, ఆఫ్ఘనిస్తాన్‌లోనూ ముస్లింలను అణగదొక్కుతూ తన ద్వంద్వ వైఖరిని చాటుకుంటోంది. దక్షిణ చైనాలో ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉండే ఉయ్‌గుర్‌లో ముస్లిం జనాభా ఎక్కువ. కొనే్నళ్లుగా ఈ ప్రాంతంలో ముస్లిం ప్రజానీకం చైనా నుంచి స్వేచ్ఛ కావాలని డిమాండ్ చేస్తున్నారు. వీరిని అణగదొక్కేందుకు పాక్‌ను చైనా ఉపయోగించుకుంటోంది. ఇక ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా పాక్ ముస్లింలపై కపటప్రేమనే చూపిస్తోంది. చైనాతో పాక్ చెలిమికి మరో కారణం కూడా ఉంది. గల్ఫ్ తదితర దేశాలకు తన వాణిజ్య సామాజ్య్రాన్ని విస్తరించుకోవాలంటే ఇప్పుడు నిర్మిస్తున్న ఆరులైన్ల రహదారి పూర్తి కావాల్సిన అవసరం చైనాకు ఉంది. ఈ రహదారి పాక్ నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా నిర్మాణం పూర్తి చేసుకోవాలి. ఇక్కడ చైనా ప్రయోజనాలు నెరవేరాలంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో సానుకూల వాతావరణం నెలకొనాలి. కాశ్మీర్‌లో ఎన్నో ఏళ్లుగా పాక్ ప్రేరేపిత ఉగ్ర చర్యలు కొనసాగుతున్నాయి. కాశ్మీర్‌లో నిత్యం సమస్యలు సృష్టించడం ద్వారా భారత్‌కు చికాకులు కల్పించడం పాక్ లక్ష్యం. ఇదే సందర్భంలో కాశ్మీర్ సమస్యను జఠిలం చేయడం ద్వారా ఆక్రమిత కాశ్మీర్‌ను ప్రత్యేక దేశంగానో లేదా తమ దేశంలో విలీనం చేసుకోవాలన్నదే పాక్ కుట్రగా భావించాలి. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉగ్రవాద సమస్యకు కారణంగా భావిస్తున్న వర్గాలకు ఆశ్రయం ఇవ్వడంతో పాక్‌పై ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితులే తాజాగా పాక్‌కు ఆర్థిక సాయం నిలిపివేస్తూ అమెరికా నిర్ణయం తీసుకునేందుకు కూడా కారణమైందనే చెప్పాలి. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న ఆరోపణలను ఎదుర్కొంటున్న పాక్ తన వైఖరిని మార్చుకుంటున్నట్టు కన్పిస్తున్నప్పటికీ ఇది తాత్కాలికమే. పాక్ తీరులో మార్పును ఆశించడం అత్యాశే అవుతుంది.
- ప్రొఫెసర్ కె.రవి ఏయూ, విదేశీ వ్యవహారాల విభాగం, విశ్రాంత ఆచార్యులు